క్రైమ్/లీగల్

విద్యార్థికి గుంజీల్లు, టీచర్‌పై కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూణే, నవంబర్ 20: హోం వర్క్ చేయలేదన్న కారణంతో టెన్త్ విద్యార్థికి వంద గుంజీళ్ల శిక్ష వేసిన టీచర్, గార్డుపై పోలీసులు కేసు నమోదు చేశారు. మహారాష్టల్రో ఈ ఘటన చోటుచేసుకుంది. పూణేలోని మహావీర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో పదో తరగతి విద్యార్థి హోం వర్క్ చేయడం మరిచిపోయాడు. యథావిధిగా పాఠశాలకు వెళ్లాడు.
దీంతో ఆగ్రహించిన హిందీ టీచర్ విద్యార్థిని వంద గుంజీళ్లు తీయమని ఆదేశించారు. 15-20 గుంజీళ్లు తీశాక విద్యార్థి అస్వస్థతకు లోనయ్యాడు. కడుపునొప్పితో విలవిల్లాడిపోయాడు. గుంజీళ్లు తీయలేకపోతున్నానని చెప్పినా సెక్యూరిటీ గార్డు ఒప్పుకోలేదు. స్కూల్ నుంచి ఇంటికెళ్లిన బాలుడు తన బాధను తల్లిదండ్రులకు చెప్పాడు. స్కూల్ వెలుపల నిలబెట్టి మరీ శిక్షించారని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో టీచర్, గార్డుపై కేసు నమోదైంది. దీనిపై ప్రిన్సిపల్ అలకానంద సేన్‌గుప్తాను వివరణ కోరగా గార్డును ఇచ్చి బయటకు తీసుకెళ్లి గుంజీళ్లు తీయమన్నట్టు తెలిసిందని అన్నారు. అయితే 15 నుంచి 20 గుంజీళ్లు తీశాక కడుపునొప్పి వస్తుందని విద్యార్థి ఫిర్యాదు చేసినట్టు వెల్లడించారు. జవెనిల్ జస్టిస్ చట్టం కింద ఇద్దరిపై కేసు నమోదయింది.