క్రైమ్/లీగల్

చిన్నారిని చిదిమేసిన స్కూల్ బస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగెం, నవంబర్ 20: ప్రైవేటు పాఠశాల బస్సు కింద పడి చిన్నారి మృతిచెందిన సంఘటన వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలం కాట్రపల్లి గ్రామంలో బుధవారం జరిగింది. ఎస్సై నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం మామునూరు ఫాత్‌ఫాండర్ పాఠశాలకు చెందిన బస్సు ప్రతిరోజు ఉదయం సంగెం నుండి కాట్రపల్లి మీదుగా వెళ్తోంది. కాట్రపల్లి గ్రామానికి చెందిన కర్ర అమరేందర్ జ్యోత్స దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె సమ్మిత్ ఫాత్ ఫాండర్ పాఠశాలలో యూకేజీ చదువుతోంది. ఈ పాఠశాల బస్సులో కుమార్తెను ఎక్కించడానికి తల్లి తన చిన్న కూతురును వెంట బెట్టుకొని బస్సు దగ్గరికి వెళ్లి పెద్ద కుమార్తె సమ్మిత్‌ను బస్సు ఎక్కించి చిన్న కూతురు కర్ర మనస్విత (3) బస్సు ముందు నుండి ఇంటి వైపు దాటుతుండగా ఒకసారి బస్సు డ్రైవర్ ముందుకు వెళ్లడంతో బస్సు ముందు టైర్ కింద పడి మనస్విత అక్కడికక్కడే మృతిచెందింది. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.
*చిత్రం... చిన్నారి మనస్విత మృతదేహం