క్రైమ్/లీగల్

చిదంబరాన్ని ప్రశ్నించొచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 21: ఐఎన్‌ఎక్స్ మీడియా అవినీతి కేసులో తీహార్ జైలులోఉన్న కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరాన్ని ప్రశ్నించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కి ఢిల్లీ కోర్టు అనుమతి మంజూరు చేసింది. ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో ఆయన మనీలాండరింగ్ అభియోగాలు ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరాన్ని ఈనెల 22,23 తేదీలు(శుక్ర,శనివారాలు) ప్రశ్నించేందుకు ప్రత్యేక న్యాయమూర్తి అజయ్ కుమార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. చిదంబరాన్ని ప్రశ్నించేందుకు అనుమతి ఇవ్వాలని ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై సానుకూలంగా స్పందించిన న్యాయస్థానం ఆ రెండు రోజులు ఉదయం 10 నుంచి 1 గంట వరకూ, మళ్లీ మధ్యా హ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ఆయన ప్రశ్నించడానికి వీలుగా అనుమతి ఇచ్చింది. ఇంతకు ముందు చిదంబరం జుడీషియల్ కస్టడీ ఈనెల 27 వరకూ కోర్టు పొడిగించింది. 74 ఏళ్ల చిదంబరం బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేశారు. మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం పాత్రకు సంబంధించి ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని, ఈ కేసులో ఆయన చాలా కీలకమని ఈడీ వాదించింది. పైగా ఆయనకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలను తారుమారు చేస్తారని న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. ఐఎన్‌ఎక్స్ మీడియా కుంభకోణం కేసులో ఆగస్టు 21న సీబీఐ చిదంబరాన్ని అరెస్టు చేసింది. సుప్రీం కోర్టు అక్టోబర్ 22న బెయిల్ మంజూరు చేసింది. అయితే మనీలాండరింగ్ కేసులో ఈడీ అక్టోబర్ 16న ఆయనను తీహార్ జైలులోనే అరెస్టు చేసింది. కాంగ్రెస్ సీనియర్ నేత ఈనెల 27 వరకూ జుడీషియల్ కస్టడీలో ఉన్నారు.