క్రైమ్/లీగల్

రాజీవ్ హంతకుడు పయాస్‌కు పెరోల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, నవంబర్ 21: రాజీవ్ గాంధీ హంతకుల్లో ఒకడైన రాబర్ట్ పయాస్‌కు మద్రాస్ హైకోర్టు గురువారం 30 రోజుల పెరోల్‌ను మంజూరు చేసింది. పయాస్‌తో పాటు మురుగన్, శాంతన్, పెరరివలన్, రవిచంద్రన్, జయకుమార్, నళిని కూడా ఈకేసులో జీవిత ఖైదు శిక్షను అనుభవిస్తున్నారు. తన కుమారుడు తమిళ్‌కొ వివాహం జరగనుందని, కాబట్టి పెళ్లి పనులు చేసుకోవడానికి తనకు పెరోల్‌ను ఇవ్వాలని పయాస్ చేసుకున్న విజ్ఞప్తిపై న్యాయమూర్తులు ఎంఎం సుందరేశ్, ఆర్‌ఎంటీ టీకా రామన్‌తో కూడిన మద్రాసు హైకోర్టు ధర్మాసనం సానుకూలంగా స్పందించింది. ఈనెల 25 నుంచి డిసెంబర్ 24వ తేదీ వరకూ పెరోల్‌ను మంజూరు చేసింది. నీలంకారయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తన ఇంట్లో పయాస్ ఉంటాడని చంద్రశేఖరన్ అనే వ్యక్తి నుంచి అఫిడవిట్ తీసుకున్న తర్వాత కోర్టు తన నిర్ణయాన్ని ప్రకటించింది. 1991 ఆగస్టు 16 నుంచి పయాస్ జైల్లోనే ఉన్నాడు. నిజానికి అతను 28 సంవత్సరాల జైలు శిక్షను ఇప్పటికే పూర్తి చేశాడు. ఈ విషయాన్ని సెప్టెంబర్ మాసంలో పెరోల్ కోసం దాఖలు చేసుకున్న పిటిషన్‌లో పేర్కొన్నాడు. అంతేగాక, ఇంత కాలం తాను ఎన్నడూ సెలవును వాడుకోలేదని, జైలు నుంచి బయటకు వెళ్లలేదని వివరించాడు. 1982లో తమిళనాడు ప్రభుత్వం చేసిన జైలు శిక్ష రద్దు చట్టం కింద కూడా తాను ఎలాంటి దరఖాస్తులు చేసుకోలేదని, 40 రోజుల పెరోల్‌ను మంజూరు చేయాలని కోరాడు. కాగా, జైలు నిబంధనావళిలోని 25వ అధికరణ కింద అతనికి పెరోల్‌ను మంజూరు చేస్తున్నామని, అయితే, ఎప్పటికప్పుడు వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్‌లో అందచేయాలని హైకోర్టు బెంచ్ పేర్కొంది. డిసెంబర్ 24వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా తిరిగి జైలుకు రావాలని ఆదేశించింది.
1991 మే 21న తమిళనాడులోని పెరంబదూర్‌లో ఎల్‌టీటీఈ దాడిలో రాజీవ్ గాంధీ మృతి చెందిన, ఈ కేసు పలు నాటకీయ మలుపులు తిరిగింది. చివరికి దోషులుగా తేలిన ఏడుగురు జీవితకాల జైలును అనుభవిస్తున్నారు.

*చిత్రం... రాబర్ట్ పయాస్‌