క్రైమ్/లీగల్

డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో 40మంది పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), నవంబర్ 21: ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై కొనసాగుతున్న తనిఖీల్లో భాగంగా పోలీసు కమిషనర్ సీహెచ్ ద్వారకాతిరుమలరావు ఆదేశాలతో నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మద్యం మత్తులో వాహనాలు నడుపుతున్న 40మంది వాహనచోదకులు పట్టుబడ్డారు. ట్రాఫిక్ ఏడీసీపీ టీవీ నాగరాజు పర్యవేక్షణలో నిర్వహించిన తనిఖీల్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 518 కేసులు నమోదు చేశారు. 95వేల రూపాయలు జరిమానా విధించి వారి వాహనాలు సీజ్ చేశారు. అనంతరం పట్టుబడిన 40మందికి వ్యాస్ కాంప్లెక్స్‌లో కౌనె్సలింగ్ ఇచ్చి, ట్రాపిక్ నిబంధనలు వివరించారు. వాలంటరీ హెల్త్ ఎడ్యుకేషన్ ఎకానమీ డెవలప్‌మెంట్ యూనిట్ స్వచ్ఛంద సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎం వాసు కౌనె్సలింగ్ ఇచ్చారు. కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐ రావి సురేష్‌రెడ్డి, స్వచ్ఛంద సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎం వాసు, ట్రాఫిక్ ఏఎస్‌ఐ శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు.