క్రైమ్/లీగల్

ఎయిర్‌పోర్టులు, మేకిన్ ఇండియా ప్రాజెక్టుల్లో ఉథ్యోగాలంటూ మోసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 12: ఎయిర్‌పోర్టుల్లో, మేకిన్ ఇండియా ప్రాజెక్టుల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసం చేస్తున్న ఢిల్లీ నివాసిని హైదరాబాద్ నగర సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి రూ.4.02 లక్షల నగదు, 16 మొబైల్ ఫోన్లు, చెక్‌బుక్‌లు, ఎటిఎం కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి సిసిఎస్ డిసిపి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌కు చెందిన సుక్రితి సింగ్, యాదగిరి, జెఎస్ రవూఫ్‌లు గత ఏడాది డిసెంబర్, ఈ ఏడాది జనవరి నెలల్లో తాము మోసపోయినట్లు సైబర్ క్రైం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు తమను ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసం చేశారని వారు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితులు నిందితులు తెలిపిన బ్యాంక్ అక్కౌంట్లలో రూ.83 వేలు, రూ.1.70 లక్షలు, రూ.4.17 లక్షలు జమ చేశారు. నగదు వారి అక్కౌంట్లలోకి చేరిన తర్వాత వారి నుంచి ఎలాంటి జవాబు లేకపోవడంతో మోసపోయినట్లు గ్రహించారు. ఈ మోసం కేసులో ప్రధాన నిందితుడు కపిల్‌కుమార్‌ను ఢిల్లీలో అరెస్టు చేసి ట్రాన్‌సిస్ట్ వారెంట్‌తో హైదరాబాద్ తీసుకు వచ్చినట్లు డిసిపి తెలిపారు. జస్ట్ డయల్, షైన్ డాట్‌కామ్, వెబ్ పోర్టల్స్‌లో ఉద్యోగాల కోసం అనే్వషిస్తున్న వారిని గుర్తించి వారికి ఫోన్లు చేసి తప్పుడు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ తప్పుడు వాగ్ధానం చేసి సొమ్ములు కాజేస్తున్నట్లు సైబర్ పోలీసుల విచారణలో తేలింది. సైబర్ క్రైం ఇన్‌స్పెక్టర్ బి.రమేష్ నేతృత్వంలోని ఎస్‌ఐలు నరేష్, సురేష్ సిబ్బంది ఈ కేసును దర్యాప్తు చేశారు.