క్రైమ్/లీగల్

ఏసీబీకి చిక్కిన మున్సిపల్ బిల్ కలెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిఠాపురం, ఏప్రిల్ 17: పిఠాపురం పురపాలక సంఘ కార్యాలయంలో పనిచేస్తున్న బిల్లు కలెక్టర్ జి నాగరాజు లంచం తీసుకుంటూ మంగళవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు చిక్కారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న వీధిలో నివసిస్తున్న గొల్లపల్లి కన్నయ్య ఇటీవల ఒక ఇంటిని కొనుగోలుచేశారు. ఇంటి పన్ను తన పేరిట మార్పు నిమిత్తం మున్సిపల్ కార్యాలయంలో బిల్లు కలెక్టర్ నాగరాజును సంప్రదించారు. పన్ను మార్పుచేయాలంటే రూ.8000 ఇవ్వాలని నాగరాజు డిమాండు చేశాడు. అయితే తాను రూ.6000 మాత్రమే ఇచ్చుకోగలనని చెప్పిన కన్నయ్య రాజమహేంద్రవరం ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. మంగళవారం మధ్యాహ్నం మున్సిపల్ కార్యాలయంలో కన్నయ్య నుంచి బిల్లు కలెక్టర్ నాగరాజు రూ.6వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ డిఎస్పీ ఎం సుధాకర్ ఆధ్వర్యంలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం ఏసీబీ డీఎస్పీ సుధాకర్, సిబ్బంది మున్సిపల్ కార్యాలయంలో రెవెన్యూ రికార్డులను తనిఖీచేశారు. అనంతరం కమిషనర్ ఛాంబర్లో కూడా సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు నిందితుడు బిల్లు కలెక్టర్ నాగరాజును అరెస్టుచేసినట్టు తెలిపారు. బుధవారం ఇతనిని విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ చెప్పారు. ఈ దాడిలో ఏసీబీ ఇన్‌స్పెక్టర్లు మోహనరావు, పుల్లారావు, తిలక్, సిబ్బంది పాల్గొన్నారు. గతంలో ఒకసారి పిఠాపురం మున్సిపాల్టీలో టౌన్ ప్లానింగ్ విభాగంలో టీపీఎస్ ఏసీబీకి చిక్కగా, ఇప్పుడు మళ్లీ రెవెన్యూ విభాగంలో బిల్లు కలెక్టర్ పట్టుబట్టడంతో మున్సిపల్ అధికారుల పనితీరుపై తీవ్ర స్థాయిలో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.