క్రైమ్/లీగల్

లోయాది సహజ మరణమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: సీబీఐ న్యాయమూర్తి జస్టిస్ బి.హెచ్.లోయాది సహజ మరణమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. న్యాయ ప్రక్రియను అపఖ్యాతి పాలు చేయడానికి పిటిషనర్లు తీవ్రంగా యత్నించారని పేర్కొంటూ కేసును కొట్టివేసింది. లోయా, సోహ్రాబుద్దీన్ ఎన్‌కౌంటర్ కేసును విచారిస్తున్నారు. కాగా నాగ్‌పూర్‌లో తన స్నేహితుడి కుమార్తె వివాహానికి హాజరై వస్తుండగా గుండెపోటుతో 2014, డిసెంబర్ 1న అకస్మాత్తుగా మరణించారు. జస్టిస్ లోయా మరణంపై నలుగురు న్యాయమూర్తులు వ్యక్తం చేసిన అనుమానాల్లో అర్థంలేదని, రికార్డులను
పరిశీలిస్తే ఆయనది సహజ మరణమేనని స్పష్టమవుతోందని, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని జస్టిస్ ఎ.ఎం. ఖన్వీల్కర్, డి.వై. చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఈ పిటిషన్లను పరిశీలిస్తే న్యాయవ్యవస్థ స్వేచ్ఛపై కావాలనే దాడి జరుగుతోందన్నది స్పష్టమవుతోందని ధర్మాసనం పేర్కొంది. పిటిషనర్లు న్యాయ సంస్థల విశ్వసనీయతను దెబ్బకొట్టడానికి యత్నించారని విమర్శించింది. సీనియర్ అడ్వకేట్లు, యాక్టివిస్ట్‌లుగా ఉన్న దుష్యంత్ దావె, ఇందిరా జైసింగ్, ప్రశాంత్ భూషణ్‌లు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో సహా ఇతర జడ్జిలపై వ్యంగ్య వ్యాఖ్యలు చేశారని ధర్మాసనం పేర్కొంది. ధర్మాసనంలోని ఇద్దరు న్యాయమూర్తులైన జస్టిస్ ఎ.ఎం. ఖన్వీల్కర్, జస్టిస్ డి.వై. చంద్రచూడ్‌లు మహారాష్ట్ర నుంచి వచ్చినందువల్ల, ఈకేసును విచారించడానికి అర్హులు కారంటూ భూషణ్ పేర్కొనడానికి న్యాయమూర్తులు తీవ్రంగా పరిగణించారు. వాదనలు వినిపించే సందర్భంగా పిటిషనర్ల తరపున వాదించే న్యాయవాదులు, న్యాయమూర్తుల పట్ల పాటించాల్సిన సంస్థాగత మర్యాదను విస్మరించి అనాగరికమైన ఆరోపణలు చేశారని ధర్మాసనం పేర్కొంది. వీరిపై కోర్టు ధిక్కరణ కింద విచారణ జరుపుదామనుకున్నప్పటికీ, ఆ దిశగా ముందుకు పోవద్దని నిర్ణయించామన్నారు.‘కోర్టులు వ్యాపారాలు లేదా రాజకీయ విభేదాలను పరిష్కరించుకునే కేంద్రాలు కాదు. మార్కెట్లు లేదా ఎన్నికల్లో వాటిపై పోరాటం చేయాలి’ అని కోర్టు చీవాట్లు పెట్టింది.
గత నవంబరులో లోయా మరణించినప్పుడు, ఆయన సోదరి దీనిపై అనుమానాలు వ్యక్తంచేసి వివాదానికి తెరలేపారు. అదీకాకుండా లోయా సొహ్రాబుద్దీన్ ఎన్‌కౌంటర్ కేసును వాదిస్తుండటం అనుమానాలకు ఆజ్యం పోసింది. అయితే జనవరి 14న లోయా కుమారుడు ఒక ప్రకటన చేస్తూ తన తండ్రిది సహజ మరణమేనని స్పష్టం చేశారు.