క్రైమ్/లీగల్

కొడ్నానీ నిర్దోషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహ్మదాబాద్: పదహారేళ్ల క్రితం నాటి నరోదా పటియా ఊచకోత కేసులో బీజేపీ మాజీ మంత్రి మాయా కొడ్నానీ, మరో 17మందిని గుజరాత్ హైకోర్టు శుక్రవారం నిర్దోషులుగా ప్రకటించింది. అయితే 97మంది మరణానికి సంబంధించిన 2002నాటి ఈ కేసులో బజరంగ్ దళ్ మాజీ నాయకుడు బాబూ బజరంగీ సహా 13మంది శిక్షలను ధృవీకరించింది. 2012లో ఈ కేసుకు సంబంధించి హైకోర్టు దోషులుగా ప్రకటించిన 32మందిలో 18మంది నిర్దోషులుగా విడుదలయ్యారు. మాయా కోడ్నానీ బీజేపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. నరోదా పటియా మారణ కాండ సూత్రధారి మాయా కొద్నానీనేనంటూ ట్రయల్ కోర్టు నిర్థారించింది. ఆమెకు 28 సంవత్సరాల పాటు జైలు శిక్ష కూడా విధించింది. అయినా 2007లో అప్పటి నరేంద్ర మోదీ ప్రభుత్వంలో మంత్రిగా కూడా ఆమె పని చేశారు. ఈ కేసు విచారణ ఓ కొలిక్కి రావడంతో కొద్నానీని అరెస్టు చేయడం మంత్రి పదవికి ఆమె రాజీనామా చేయడం జరిగిపోయాయి. కాగా తాజాగా కొద్నానీని నిర్దోషిగా ప్రకటించిన హైకోర్టు అల్లర్లలో ఆమె ప్రమేయం విషయంలో సాక్షుల వాంగ్మూలాలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని పేర్కొంది. ఆ సమయంలో కొద్నానీ తమతో మాట్లాడనే లేదని ప్రాసిక్యూషన్ సాక్షులు కూడా వెల్లడించినట్టు హైకోర్టు పేర్కొంది. ఇలాంటి ప్రతికూల, నిరాధార పరిస్థితుల్లో, గందరగోళ సాక్షాల మధ్య కొద్నానీపై అభియోగాలను అంగీకరించజాలమని తెలిపింది.