క్రైమ్/లీగల్

శబరిమల కేసు విచారణ వచ్చే వారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: శబరిమల ఆలయంలోకి వెళ్ళేందుకు ప్రయత్నించి అక్కడి అధికారులు అడ్డుకోవడంతో వెనుదిరిగిన ఓ మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు వచ్చే వారం విచారణకు స్వీకరించనున్నది. వయస్సుతో సంబంధం లేకుండా మహిళలు ఎవరైనా శబరిమల ఆలయానికి వెళ్ళవచ్చన్న సుప్రీం కోర్టు ఆదేశాలను కేరళ పోలీసులు, ఆలయ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ బిందు అమ్మినీ అనే మహిళ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. న్యాయమూర్తులు ఎస్‌ఏ బాబ్డె, బీఆర్ గవాయి, సూర్యకాంత్‌తో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం ఈ పిటిషన్‌ను స్వీకరించి, విచారణను వచ్చే వారం చేపట్టనున్నట్లు ప్రకటించింది. గత ఏడాది సెప్టెంబర్ మాసంలో ఐదుగురు సభ్యులతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం శబరిమల వివాదంపై చారిత్రక తీర్పును ఇచ్చిన సంగతి తెలిసిందే. వయస్సుతో సంబంధం లేకుండా మహిళలు ఎవరైనా సరే ఆలయాన్ని దర్శించవచ్చన్న తీర్పును ధర్మాసనంలోని నలుగురు ఆమోదించగా, ఒకరు మాత్రమే వ్యతిరేకించారు. సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో గత ఏడాది కొంత మంది మహిళలు అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్నారు. అయితే ఈ ఏడాది రాష్ట్రం మొత్తం తీవ్ర నిరసనలు వ్యక్తం కావడంతో కేరళ సర్కారు కూడా ఆచితూచి స్పందించింది. సుప్రీం కోర్టు నుంచి స్పష్టమైన ఆదేశాలు లేనిదే దర్శనానికి అనుమతించేది లేదని ఆలయ అధికారులు బిందుకు తేల్చి చెప్పారు. తమకు రక్షణ కల్పించాల్సిందిగా తృప్తి దేశాయ్ చేసన విజ్ఞప్తిని కేరళ పోలీసులు తోసిపుచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో భద్రత కల్పించడం అసాధ్యమని స్పష్టం చేశారు. కాగా బిందు, ఫాతిమా ఆలయంలోకి ప్రవేశించేందుకు చేసిన ప్రయత్నాలను అక్కడి అధికారులు అడ్డుకున్నారు. దీంతో వారి చర్య కోర్టు ధిక్కారం కిందకు వస్తుందని బిందు సుప్రీం కోర్టులో దాఖలు చేసిన తన పిటీషన్‌లో పేర్కొన్నారు. తమకు న్యాయం చేయాలని ఆమె కోరారు.
ఎలక్టోరల్ బాండ్లపై..
వివాదస్పదంగా మారిన ఎలక్టోరల్ బాండ్ల అంశంపై ఓ ఎన్జీవో లేవనెత్తిన అభ్యంతరాలను జనవరిలో విచారణకు స్వీకరించనున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. వివిధ రాజకీయ పార్టీల తరఫున అభ్యర్థులు పోటీ చేసేందుకు అవసరమైన మొత్తాలను సేకరించేందుకు ఎలక్టోరల్ బాండ్లను విడుదల చేస్తారు. రిజర్వ్ బ్యాంక్, ఎన్నికల సంఘం ఈ బాండ్ల విడుదలకు ఆమోదం తెలిపింది. అయితే ఈ పేరుతో ప్రజాధనం దోపిడీ జరుగుతున్నదని ఆరోపించిన ఓ ఎన్జీవో తక్షణమే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని తన పిటీషన్‌లో కోరారు. ఈ దిశగా ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. కాగా పిటీషన్‌పై విచారణను జనవరిలో చేపట్టనున్నట్లు సుప్రీం కోర్టు ప్రకటించింది.