క్రైమ్/లీగల్

మరో పిటిషన్ దాఖలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ‘దిశ’ కేసులో నలుగురు నిందితుల ఎన్‌కౌంటర్‌పై రాష్ట్ర హైకోర్టులో మంగళవారం మరో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను సివిల్ లిబర్టీస్ నేత లక్ష్మణ్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లు అన్నింటినీ హైకోర్టు ఈ నెల 12వ తేదీన విచారణ చేపట్టనుంది. అంతకంటే ముందు ఈ నెల 11న దిశ కేసులో ఎన్‌కౌంటర్ అంశంపై
సర్వోన్నత న్యా యస్థానం విచారణ చేపట్టనుంది. నిందితుల
ఎన్‌కౌంటర్‌పై పౌరహక్కుల సంఘాలు, మహిళా సంఘాలు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. వాటిని పిటిషన్‌లుగా పరిగణించిన హైకోర్టు విచారణకు స్వీకరించింది. సోమవారం ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన సమయంలో ఇదే అంశంపై సుప్రీంకోర్టులో విచారణ అంశం ప్రస్తావనకు వచ్చింది. రాఘవేంద్ర ప్రసాద్ అనే న్యాయవాది దాఖలు చేసిన ప్రజావాజ్య పిటిషన్‌తో కలిపి అన్నింటినీ హైకోర్టు గురువారం విచారణ చేపట్టనుంది. ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన అన్ని ఆధారాలను సమర్పించాలని కోర్టు ఆదేశించింది. ఇంకోవైపు ప్రజా సంఘాల లేఖను ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించినందున విచారణలో కోర్టుకు సహకరించేందుకు సీనియర్ న్యాయవాది, మాజీ అడ్వకేట్ జనరల్ దేశాయ్ ప్రకాశ్‌రెడ్డిని అమికస్ క్యూరీగా హైకోర్టు నియమించింది.