క్రైమ్/లీగల్

సొంత బిడ్డనే కిడ్నాప్ చేసిన కన్నతల్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ పశ్చిమ, డిసెంబర్ 10: దంపతుల మధ్య విభేదాలతో పాతబస్తీలోని ఓ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం ఇరకాటంలో పడింది. స్కూల్‌లో చదువుతున్న ఏడేళ్ల బాలుడిని సొంత తల్లే బంధువుల సహకారంతో కిడ్నాప్ చేయడం కొత్తపేట పోలీసు స్టేషన్ పరిధిలో సంచలనం రేపింది. వించిపేట ప్రాంతానికి చెందిన ఓ యువకుడికి మార్కాపురానికి చెందిన ఓ యువతికి సుమారు 10 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు సంతానం కలిగారు. దంపతుల మధ్య మనస్పర్థలు కోర్టు గుమ్మాలక్కెయి. దాంతో ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. తండ్రి విజయవాడలో, తల్లి మార్కాపురంలో ఉంటున్నారు. మంగళవారం ఉదయం మార్కాపురం నుండి వచ్చిన ఆ యువతి నైజాంగేటు సెంటర్‌లోని తన బిడ్డలు చదువుతున్న స్కూల్ వద్దకు వచ్చింది. తన కుమార్తె, కుమారులను చూస్తానని నమ్మించింది. దాంతో స్కూల్ యాజమాన్యం అబ్బాయి, అమ్మాయిలను తల్లికి అప్పగించారు. క్షణాల వ్యవధిలో ఇద్దరు చిన్నారులను ఆటోలో ఎక్కించి తీసుకెళ్లే ప్రయత్నం చేయగా బాలిక భయంతో కేకలు వేస్తూ ఆటోలో నుండి కిందకు దూకి తప్పించుకుంది. బాలుడిని మాత్రం వారు ఆటోలో ఎత్తుకెళ్లారు. బాలుని తల్లి, మేనమామలు బాలుడిని కిడ్నాప్ చేయడం సంచలనం రేపింది. ఆటోలో నుండి తప్పించుకున్న బాలిక జరిగిన విషయాన్ని తండ్రికి వివరించడంతో తండ్రి వెంటనే కొత్తపేట పోలీసులను ఆశ్రయిచగా పోలీసులు అప్రమత్తమయ్యారు. హుటాహుటిన స్కూల్ ప్రాంతానికి చేరుకుని బాలుని కిడ్నాప్ వాస్తవమేనని ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు. దాంతో స్కూల్ యాజమాన్యాన్ని బాధ్యులను చేస్తూ క్లాసు టీచర్‌ని, సిబ్బందిని స్టేషన్‌కి రప్పించి విచారణ చేపట్టారు. ఈ విషయంపై సీఐ ఎండీ ఉమర్‌ని వివరణ కోరగా కిడ్నాప్ జరిగిన మాట వాస్తవమేనని అయితే తీసుకెళ్లింది స్వయాన తల్లే కనుక ఆందోళన చెందాల్సిన పని లేకుండా బాలుని ఆచూకీ తెలుసుకుని నగరానికి తీసుకొస్తామన్నారు. తండ్రిని, స్కూల్ టీచర్‌ని, పోలీసులను బృందంగా ఏర్పాటు చేసి మార్కాపురం పంపించామన్నారు. బాలుని తండ్రి, నానమ్మలు ముందుగానే స్కూల్ యాజమాన్యానికి తామే గార్డియన్స్ అని, ఎవరు వచ్చినా బయట వారితో పిల్లలను పంపవద్దని చెప్పారని సీఐ వివరించారు. దంపతుల మధ్య విభేదాలు కోర్టు పరిధిలో ఉన్నాయని, కోర్డువారి ఆదేశాలను పరిశీలించాక పిల్లలు ఎవరి వద్ద ఉండాలో చట్ట ప్రకారం నిర్ణయిస్తామని సీఐ తెలిపారు. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని సీఐ వ్యాఖ్యానించారు. తండ్రి, నానమ్మ ముందస్తుగా చెప్పినా బాలుడిని తల్లికి అప్పగించడం సరైంది కాదన్నారు. ఈ విషయంపై స్కూల్ ప్రిన్సిపాల్ పుప్పాల శ్రీనివాసరావుని వివరణ కోరగా తల్లిదండ్రులు తనకు చెప్పిన మాట వాస్తవమేనని అయితే తాను తిరుపతి తిరుమల దేవస్థానంకి బయలుదేరుతూ ఈ విషయం తన సిబ్బందికి సమాచారం సకాలంలో ఇవ్వలేకపోయానని విచారం వ్యక్తం చేశారు.