క్రైమ్/లీగల్

ఏసీబీ వలలో జూనియర్ అసిస్టెంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జనగామ టౌన్, డిసెంబర్ 11: ఓ కాంట్రాక్టు ఉద్యోగికి సంబంధించిన వేతనం విడుదల చేయడంలో లంచం తీసుకుంటుండగా డీఎంఅండ్‌హెచ్‌వో కార్యాలయ జూనియర్ అసిస్టెంట్‌ని అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అవినీతి నిరోధక శాఖ డీఎస్‌పీ మధుసూధన్ తెలిపిన వివరాల ప్రకారం... జనగామ జిల్లా కేంద్రంలోని డీఎం అండ్ హెచ్‌వో కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న పృథ్వీరాజ్ రూ. 4వేల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. లింగాలఘణపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సబ్ సెంటర్ పరిధిలోని మాణిక్యపురం మంథోని గూడెం, పిట్టలగూడెం గ్రామాల్లో ఏఎన్‌ఎంగా కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న అనితకు గత 13 నెలల వేతనం రావాల్సి ఉంది. ఈ వేతనం మంజూరు చేయడంలో కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ ఆమెను అనేక ఇబ్బందులకు గురిచేశారు. ఈ విషయాన్ని డీ ఎం అండ్ హెచ్‌వోకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ వేతనం మంజూరు కాకపోవడంతో మరోసారి పృథ్వీరాజ్ వద్దకు వెళ్లి బతిమిలాడింది. రూ. 10 వేలు ఇస్తే వేతనాన్ని మంజూరు చేస్తానని పృథ్వీరాజ్ ఆమెను డిమాండ్ చేశారు. అందుకు అనిత రూ. 4వేలు ఇస్తాననగా అంగీకరించాడు. దీంతో ఆమె అవినీతి అధికారులను ఆశ్రయించింది. డీసీపీ మధుసూదన్, సీ ఐ వాసాల సతీష్ నిఘా వేసి అనిత నుండి రూ. 4వేలు తీసుకుంటున్న పృథ్వీరాజ్‌ని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి నిందితుడిని నాంపల్లి కోర్టుకు పంపినట్టు తెలిపారు.

*చిత్రం... జూనియర్ అసిస్టెంట్ పృథ్వీరాజ్