క్రైమ్/లీగల్

రివ్యూ పిటిషన్ల కొట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు నవంబర్ 9న ఇచ్చిన అయోధ్య తీర్పును పునఃపరిశీలించాలంటూ దాఖలైన పద్దెనిమిది రివ్యూ పిటిషన్లు బుట్టదాఖలయ్యాయి. దీనితో రామమందర నిర్మాణానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బాబ్డే నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం గురువారం చాంబర్‌లో ఈ పద్దెనిమిది రివ్యూవ్ పటిషన్లను పరిశీలించింది. తమ నవంబర్ తొమ్మిదో తీర్పును పనఃపరిశీలించవలసిన అవసరం ఎంత మాత్రం లేదని ప్రకటిస్తూ వాటిని కొట్టివేసింది. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులో వివాదాస్పద భూమిని హిందువులకు కేటాయించి, ముస్లింలు మరో చోట మసీదు నిర్మించుకునేందుకు ఐదు ఎకరాల భూమిని కేటాయించాలని ఆదేశించిన విషయం తెలిసిందే. కాగా, ఈ తీర్పును పునఃపరిశీలించే అవసరాన్ని సూచించే ఒక్క అంశం కూడా రివ్యూవ్ పిటిషన్లలో కనిపించలేదని బాబ్డేతో పాటు న్యాయమూర్తులు డీవై
చంద్రచూడ్, అశోక్ భూషన్, ఎస్. అబ్దుల్ నజీర్, సంజీవ్ ఖన్నా సభ్యులుగా ఉన్న రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. ‘మేము రివ్యూవ్ పిటిషన్లు, వాటితో పాటు దాఖలైన పత్రాలను ఎంతో జాగ్రత్తగా పరిశీలించాం. నవంబర్ తీర్పును పునఃపరిశీలించవలసిన అవసరాన్ని సూచించే ఒక్క అంశం కూడా ఇందులో కనిపించలేదు. అందుకే రివ్యూవ్ పటిషన్లను కొట్టివేస్తున్నాం’ అని రాజ్యాంగ ధర్మాసనం ప్రకటించింది. సుప్రీం కోర్టులో దాఖలైన మొత్తం పద్దెనిమిది రివ్యూవ్ పిటిషన్లలో తొమ్మిది పిటిషన్లను ఒరిజినల్ కేసుతో సంబంధం ఉన్న వారు దాఖలు చేస్తే మిగతా తొమ్మిది పిటిషన్లను ఇతరులు దాఖలు చేశారు. సుప్రీం కోర్టు ఈరోజు రివ్యూవ్ పిటిషన్లను కూడా కొట్టి వేయటంతో అయోధ్యలో రామమంది నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న అన్ని సమస్యలు తొలగిపోయాయి.