క్రైమ్/లీగల్

బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ ప్రమాదంలో నిందితుడిని అరెస్టు చేయవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 12: బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ కారు ప్రమాదం కేసులో రాయదుర్గం పోలీసులకు మరోసారి చుక్కెదురైంది. కారు ప్రమాదం కేసులో నిందితుడిగా ఉన్న కృష్ణమిలన్‌రావు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు గురువారం నాడు విచారణ కొనసాగించింది. కృష్ణమిలన్‌రావును జనవరి 3వ తేదీ వరకూ అరెస్టు చేయవద్దని న్యాయస్థానం ఈ సందర్భంగా పోలీసులను ఆదేశించింది. కారు యాక్సిడెంట్ చేసిన వ్యక్తిపై 204(2) సెక్షన్ ఎలా పెడతారని రాయదుర్గం పోలీసులను హైకోర్టు ప్రశ్నించింది. తదుపరి విచారణను జనవరి 3వ తేదీకి వాయిదా వేసింది. కాగా కృష్ణమిలన్‌రావు నిర్లక్ష్యం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని పోలీసులు కోర్టుకు తెలిపారు. నిందితుడు అధిక వేగంతో దూసుకెళ్లినందునే ఈ ప్రమాదం జరిగినట్టు ఆధారాలు సేకరించారు. అంతకుముందు నిందితుడిని డిసెంబర్ 12వ తేదీ వరకూ అరెస్టు చేయరాదని కోర్టు స్టే విధించింది. కాగా నవంబర్ 23న మధ్యాహ్నం బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ నుండి కారు అదుపు తప్పి ఫల్టీలు కొడుతూ రోడ్డుపై పడిన ఘటనలో సత్యవతి (56) అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, కుబ్రా(23), బాలరాజ్ నాయక్, ప్రణీతలు గాయాలపాలయ్యారు.