క్రైమ్/లీగల్

‘ఖాకీ’ మాటున చోరీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు: ‘ కాకినాడ నుండి చెన్నై వెళ్లే సర్కార్ ఎక్స్‌ప్రెస్‌లో ఈనెల 9న ఒక ప్రయాణికుడి బ్యాగును తనిఖీల పేరుతో నెల్లూరు రైల్వే డి ఎస్పీ వద్ద డ్రైవర్‌గా విధులు నిర్వర్తిస్తున్న హెడ్‌కానిస్టేబుల్ ఆంజనేయులు మరో ముగ్గురితో కలిసి అపహరించుకుపోయాడు. ఆ బ్యాగులో రూ. 67.5లక్షల నగదు ఉంది.’
‘మరో సంఘటనలో ఇదే ఏడాది ఏప్రిల్ నెలాఖరులో శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరుజిల్లా గూడూరు రైల్వేస్టేషన్ వద్ద నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ఓ మహిళ వద్ద ఉన్న బ్యాగును పోలీసులమంటూ తనిఖీలు నిర్వహించి బ్యాగు తీసుకొని నలుగురు బెటాలియన్ పోలీసులు ఉడాయించారు. ఆ బ్యాగులో రూ.52లక్షల నగదు ఉంది’.
జిల్లాతో పాటు రాష్ట్రంలోనే సంచలనం రేపిన ఈ రెండు సంఘటనలో నిందితులు పోలీసులు కావడం గమనార్హం. సర్కార్ ఎక్స్‌ప్రెస్ ఘటనలో చోరీలో కీలకపాత్ర వహించింది సాక్షాత్తూ రైల్వే డిఎస్పీ కారు డ్రైవర్ కావడం విశేషం. ఈ రెండు సంఘటనలే కాకుండా ఇటీవల కాలంలో రాష్ట్రంలో రైళ్లలో తరచూ జరుగుతున్న అనేక చోరీల వెనుక కొందరు పోలీసుల హస్తం ఉందనే ఆరోపణలున్నాయి. తనిఖీల పేరుతో ప్రయాణికుల బ్యాగులను చోరీ చేయడం, రైల్వే చోరీలకు పాల్పడే నిందితులకు రక్షణ కల్పించి భాగాలు పంచుకోవడం వంటి చర్యలకు కూడా పాల్పడుతున్నట్లు విమర్శలున్నాయి. చోరీ జరిగితే బాధితుడు ఫిర్యాదు చేయలేని విషయాన్ని తమకు అనుకూలంగా మలచుకొని కొందరు ప్రభుత్వ రైల్వే పోలీసులు ఇతరులతో కలిసి ఇటువంటి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు స్పష్టమవుతోంది.
గంజాయి సరఫరా, ప్రభుత్వానికి పన్నులు కట్టకుండా తప్పించుకోవాలనే వ్యాపారుల అత్యాశ ఇటువంటి చోరీలకు ఊతమిస్తోంది. రాష్ట్రంలోని మూడు ప్రధాన రైల్వే డివిజన్ల పరిధిలో సుమారు 3170 కి.మీ. మేర రైల్వే లైను ఉంది. వందల సంఖ్యలో రైళ్లు ఈ మార్గాన తిరుగుతూ ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తుంటాయి. రైళ్లలో చోరీల సంఖ్య ఫిర్యాదుల విషయంలో గతేడాదితో పోలిస్తే తగ్గినప్పటికీ ఫిర్యాదుకు అందని ఎన్నో చోరీలు రైళ్లలో నిత్యం చోటుచేసుకుంటున్నాయి. విశాఖ మన్యం ప్రాంతాల నుండి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో పాటు చెన్నై, బెంగళూరులకు గంజాయి సరఫరా చేసే స్మగ్లర్లు ఎక్కువగా రైళ్ల ద్వారా తమ కార్యకలాపాలను సాగిస్తున్నారు. ఈ విధంగా గంజాయి సరఫరా చేసే నిందితులను తమ లక్ష్యంగా చేసుకుంటున్న పోలీసులు రైళ్లలో తరచూ తనిఖీలు నిర్వహిస్తూ గంజాయి సంచులు దొరికితే నిందితులపై కేసులు నమోదు చేయకుండా వారిని బెదిరించి ఎంతో కొంత వసూలు చేసి గంజాయి సంచులను తమ వెంట తీసుకెళ్లిపోతున్నారు. జిల్లా ప్రధాన కేంద్రాల్లో గంజాయి విక్రయాలు జరిపే వారితో సాన్నిహిత్యం పెంచుకొని తాము తనిఖీల్లో పట్టుకున్న గంజాయి సంచులను వారికి అప్పగించి విక్రయాలు సాగిస్తున్నారని విశ్వసనీయ సమాచారం. సర్కార్ ఎక్స్‌ప్రెస్ చోరీ ఘటనలో గంజాయి బ్యాగు అని భావించి దాన్ని తరలించాలని నిందితులు భావించారు. పోలీసులకు చిక్కిన వారిలో హెడ్ కానిస్టేబుల్‌తో పాటు ఒక రైల్వే పోర్టర్, ఇద్దరు నెల్లూరులో గంజాయి విక్రయించే వారుండడం గమనార్హం. దర్యాప్తులోనూ వారు ఇదే విషయాన్ని వెల్లడించారు. గతంలోనూ గంజాయి బ్యాగులను వారు తనిఖీల పేరుతో తస్కరించిన సందర్భాలు పోలీసుల విచారణలో వెలుగుచూశాయి. సాధారణంగా రైళ్లలో తనిఖీలు నిర్వహించాలంటే ఇన్స్‌పెక్టర్ స్థాయి అధికారి పర్యవేక్షణలో జరగాల్సి ఉంటుంది. ఈ విషయం తెలియక బాధితులు తనిఖీలు నిర్వహించే వారిని ప్రశ్నించడం లేదు. కనీసం వారి గుర్తింపు కార్డును కూడా అడిగే సాహసం చేయకపోతుండడం నిందితులకు కలిసొస్తోంది.
గంజాయి తనిఖీల సమయంలో బంగారు వ్యాపారులు బాధితులుగా మారిపోతున్నారు. ప్రభుత్వానిక పన్ను కట్టకుండా జీరో వ్యాపారం చేసే బంగారు వ్యాపారులు అనేక మంది విజయవాడ, చీరాల, ఒంగోలు, నెల్లూరు, కావలి ప్రాంతాల నుండి చెన్నైకి వెళ్లి బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తుంటారు. ఎటువంటి బిల్లులు లేని బంగారాన్ని కొనుగోలు చేసే నిమిత్తం అత్యధిక మొత్తాల్లో నగదును చేరవేసేందుకు రైళ్లలోనే ఎక్కువగా ప్రయాణిస్తుంటారు. అధికారుల తనిఖీల్లో అడపాదడపా వీరు పట్టుబడుతున్న సందర్భాలు ఉన్నాయి. అయితే గంజాయి కోసం తనిఖీలు చేపట్టే కొందరు పోలీసులకు ఈ బంగారు వ్యాపారులు చిక్కుతున్నారు.
నెల్లూరుజిల్లాలో జరిగిన రెండు సంఘటనల్లో పోలీసులు చోరికి పాల్పడింది ఇటువంటి బంగారు వ్యాపారుల నుండే కావడం ఇందుకు ఉదాహరణగా పేర్కొనవచ్చు. ప్రభుత్వానికి పన్నుల కట్టకుండా ఆదా చేసుకుందామనే అత్యాశకు పోయి నగదును దొంగల చేతికి అందిస్తున్నారు. తమ సొత్తు చోరీకి గురయితే ప్రభుత్వ రైల్వే పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేయలేని పరిస్థితి వీళ్లది. పై రెండు సంఘటనల్లోనూ పోలీసులే చొరవ చూపి బాధితుల నుండి ఫిర్యాదు స్వీకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. నగదు తమదని తెలిస్తే ఎక్కడ ఆదాయ, వాణిజ్య పన్నుల అధికారుల నుండి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందనే కారణంతో ‘తేలు కుట్టిన దొంగ మాదిరి’ మారిపోతున్నారు. దీంతో పోలీసులకు అందుతున్న ఫిర్యాదులు అత్యల్పమనే చెప్పాలి. రైళ్లలో చోరీల సంఖ్య తగ్గుముఖం పట్టిందని, తాము తీసుకున్న అనేక చర్యల ఫలితమే ఇదని, ఆర్ పి ఎఫ్, జి ఆర్ పీ అధికారులు చెబుతున్నారు. అయితే రైల్వే పోలీసులే దొంగలుగా మారుతున్న వైనం రైళ్లలో ప్రయాణికుల భద్రతను ప్రశ్నిస్తూనే ఉంటుంది.