క్రైమ్/లీగల్

ఏసీబీ వలలో మరో అవినీతి చేప

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, డిసెంబర్ 12: అవినీతి నిరోధక శాఖ అధికారుల వలలో మరో అవినీతి చేప పడింది. రూ.5 వేలు లంచం తీసుకుంటూ విద్యుత్ డీఈ ప్రసాద్‌రావు ఏసీబీ అధికారులకు చిక్కాడు. వివరాల్లోకి వెళితే.. కొంపల్లి సర్వేనంబరు 66లో నాన్ డొమెస్టిక్ నిర్మాణం జరుగుతుంది. అందులో ఓ ట్రాన్స్‌ఫార్మర్, అండర్ గ్రౌండ్ కేబుల్ వేసేందుకు బాలనర్సింహ సబ్ కాంట్రాక్ట్ తీసుకున్నాడు. ఈ పనులకు ఎస్టిమేషన్‌కు సంబంధించిన ఫైల్ విద్యుత్ ఏఈ నుంచి డీఈ ప్రసాద్ రావు వద్దకు వెళ్లింది. ఫైల్‌ను ఎస్‌సీకి పంపాలంటే తనకు రూ.40 వేలు లంచం ఇవ్వాలని విద్యుత్ డీఈ ప్రసాద్‌రావు బాలనర్సింహను డిమాండ్ చేయగా రూ.30 వేలు ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు. రూ.25 వేలు ఇచ్చిన బాలనర్సింహ మరో రూ.5 వేలను గురువారం జీడిమెట్ల, వెనె్నలగడ్డలోని మేడ్చల్ విద్యుత్ డీఈ కార్యాలయంలో విద్యుత్ డీఈ ప్రసాద్‌రావు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ప్రసాద్ రావు ఇంట్లో కూడా సోదాలు జరుగుతున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ, ఇన్‌స్పెక్టర్ గంగాధర్, మజీర్ అలీ ఖాన్, రామలింగా రెడ్డి పాల్గొన్నారు.