క్రైమ్/లీగల్

హవాలా రాకెట్ గుట్టు రట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 12: హవాలా రాకెట్‌ను నగర టాస్క్ఫోర్స్ ఉత్తరమండల బృందం గుట్టు రట్టు చేసింది. రూ.1,40,80,000 స్వాధీనం చేసుకుని ఆరుగురిని అదుపులోకి తీసుకుంది. ఇందుకు సంబంధించి నగర పోలీసు కమిషనర్ వివి శ్రీనివాసరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రధాన నిందితుడు జయేష్‌కుమార్, బమర్‌సిన్‌హ చౌహాన్, పటేల్ ప్రదీప్‌కుమార్, గణేశ్ సత్యనారాయణ్ సాబు, బొనబోయిన విఘ్నేశ్వర్, అరుణ్‌కుమార్ దాదీచిలను అదుపులోకి తీసుకుని స్వాధీనం చేసుకున్న నగదుతో సహా వారిని ఆదాయపు పన్ను శాఖ అధికారులకు అప్పగించినట్లు తెలిపారు. ప్రధాన నిందితుడు జయేష్‌కుమార్ పటేల్ గుజరాత్‌కు చెందిన వాడు. 2009లో హైదరాబాద్‌కు వలస వచ్చి అబిడ్స్‌లో బంగారం, వజ్రాల వ్యాపారం చాలా కాలం నిర్వహించాడు. దేశ వ్యాప్తంగా క్రమేణా హవాలా వ్యాపారం చేసే స్థాయికి ఎదిగాడు. హవాలా ద్వారా దేశంలో గానీ, ఇతర దేశాల నుంచి గానీ నగదు బదిలీ చేయడంలో ఆరితేరడమే కాకుండా విస్తత్రమైన సంబంధాలు పెంచుకున్నాడు. చిరాగ్ అలి లేన్‌లోని ఒక అపార్టు ఫ్లాట్‌లో ఈ హవాలా వ్యాపారం చేస్తున్నాడు. ఇలా అక్రమ నగదు లావాదేవీలను హవాలా ద్వారా చేస్తూ 0.6 శాతం నుంచి 0.8 శాతం వరకు కమిషన్ ఆర్జిస్తూ వ్యాపారాన్ని నిర్విరామంగా కొనసాగిస్తున్నట్లు సిపి వెల్లడించారు. ఇదే జయేష్‌కుమార్‌పై 2014 మేలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి టాస్క్ఫోర్స్‌కు సమాచారం అందడంతో నిఘా ఉంచారు. ప్రధాన నిందితుడి ఏజెంట్లపైనా దృష్టిసారించారు. దీంతో టాస్క్ఫోర్స్‌కు పూర్తి సమాచారం రావడంతో నిందితుల నివాసాలపై ఏక కాలంలో దాడులు చేసి కోటి 40 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఈ హవాలా రాకెట్ గుట్టు రట్టు చేసిన టాస్క్ఫోర్స్ టీమ్‌లో నార్త్‌జోన్ ఇన్‌స్పెక్టర్ కె.నాగేశ్వరరావు, ఎస్‌ఐలు కెఎస్ రవి, బి.శ్రావణ్‌కుమార్, పి.చంద్రశేఖరరెడ్డి, కె.శ్రీకాంత్, తదితరులు ఉన్నారు.