క్రైమ్/లీగల్

వారాంతపు సంతలో పోలీసులపై కాల్పులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చింతూరు, ఏప్రిల్ 20: తూర్పు గోదావరి జిల్లా చింతూరు మండలం ఏడుగుర్రాలపల్లి వారాంతపు సంతలో శుక్రవారం పోలీసులు ఆరుగురు మావోయిస్టులను అరెస్టుచేశారు. అయితే ఈసందర్భంగా పారిపోతున్న ఒక మావోయిస్టును పోలీసులు వెంబడించగా, అతడు వారిపై కాల్పులు జరిపినట్టు విశ్వసనీయ సమాచారం. వివరాలిలావున్నాయి... మావోయిస్టు స్మాల్ యాక్షన్ టీమ్ శుక్రవారం నాటి వారాంతపు సంతలో ఉన్నట్టు సమాచారం అందుకున్న ఆంధ్రా, చత్తీస్‌గఢ్ పోలీసులు సంతను చుట్టుముట్టారు. అయిదుగురు మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒక మావోయిస్టు పోలీసుల నుండి తప్పించుకుని పారిపోతుంటే పోలీసులు వెంబడించారు. ఈ సందర్భంగా మావోయిస్టు పోలీసులపై ఒక రౌండ్ కాల్పులు జరిపి అడవిలోకి ఉడాయించినట్టు ప్రత్యక్ష సాక్షుల కథనం. తరువాత మరో ఇద్దరు మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న ఆరుగురు మావోయిస్టులను పోలీసులు ఏడుగుర్రాలపల్లి అవుట్ పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారించినట్టు తెలిసింది. అనంతరం వారిని ఛత్తీస్‌గఢ్ పోలీసులు వెంటబెట్టుకుని వారి రాష్ట్రానికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. పట్టుబడ్డ నలుగురు మావోయిస్టుల వద్ద నాలుగు గొడ్డళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్మాల్ యాక్షన్ టీమ్ రంగంలోకి దిగడంతో మావోయిస్టు హిట్‌లిస్టులో ఉన్న వారికి గుండెల్లో గుబులు నెలకొంది.