క్రైమ్/లీగల్

మద్యం తాగి వాహనం నడిపిన 95 మందికి జైలు శిక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 21: మద్యం తాగి వాహనాలు నడిపిన 95 మందికి నాంపల్లి 3, 4వ మెట్రోపాలిటన్ కోర్టు జైలు శిక్ష విధించింది. మరో 41 మంది డ్రైవింగ్ లైసెన్సులను శాశ్వతంగా రద్దు చేసింది. నగర ట్రాఫిక్ అదనపు సీపీ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆరుగురికి 10 రోజులు, ఇద్దరికి 7 రోజులు, ముగ్గురికి ఆరు రోజులు, నలుగురికి ఐదు రోజులు, 11 మందికి 4 రోజులు, 19 మందికి 3 రోజులు, 50 మందికి రెండు రోజులు జైలు శిక్ష విధించింది. ఈ నెల 16 నుంచి 20 వరకు నిర్వహించిన తనిఖీల్లో వీరందరూ మద్యం తాగి పట్టుబడ్డారు.