క్రైమ్/లీగల్

ఆర్మూర్ ఆర్డీవోకు ఆదాయానికి మించిన ఆస్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 21: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ డివిజన్ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (ఆర్డీఓ) బాలయ్ శ్రీనివాస్ ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్లు అవినీతి నిరోధక శాఖ గుర్తించింది. నిందిత అధికారి సుమారు రూ.2.66 కోట్ల విలువైన ఆస్తులు కలిగి ఉన్నట్లు తాజా తనిఖీల్లో డాక్యుమెంట్లతో సహా ఆధారాలు దొరికాయని ఏసీబీ డీజీ తెలిపారు. వీటి విలువ బహిరంగ మార్కెట్లో రూ.5 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు. నిందిత అధికారి శ్రీనివాస్ ఇప్పటికే లంచం తీసుకుంటున్న కేసులో అరెస్టు కాగా, ప్రస్తుతం సర్వీస్ నుంచి సస్పెండ్ అయ్యారు. ఇటీవలే బెయిల్‌పై విడుదలై బయటకు వచ్చారు. ఈ కేసులో భాగంగా శ్రీనివాస్ భారీగా ఆస్తులు కూడగట్టినట్లు అందిన సమాచారం మేరకు ఎసిబి బృందాలు విచారించి, తనిఖీలు చేశాయి. ఈ ఏడాది జనవరి 23న బి.రాజ్‌కుమార్ అనే వ్యక్తికి అధికారికంగా సహాయ పడేందుకు ఆర్డీఓ శ్రీనివాస్ రూ.40 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హేండెడ్‌గా దొరికిపోయారు. కాగా ఆస్తుల గురించి లోతుగా దర్యాప్తు చేశారు. ఈ సోదాల్లో కరీంనగర్‌లో ఇల్లు, హైదరాబాద్‌లోని మచ్చబొల్లారంలో రెండు ఇళ్లు, జగిత్యాలలో రెండు, దిల్‌సుఖ్‌నగర్‌లో ఒకటి, కరీంనగర్‌లో రెండు, బోడుప్పల్‌లో ఒకటి నివాస ఫ్లాట్లు కలిగి ఉన్నట్లు గుర్తించారు. రాజేంద్రనగర్‌లో ఒకటి, కండ్లకోయలో ఒకటి, శామీర్‌పేటలో ఒకటి కరీంనగర్‌లో ఒకటి ఖాళీ ప్లాట్లు కలిగి ఉన్నట్లు ఆధారాలు వెల్లడయ్యాయి. ఇంట్లో రూ.2.85 లక్షల నగదు, రూ.60 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్లు, వివిధ బ్యాంకుల్లో 47.01 లక్షల నగదు నిల్వలు, 31.19 తులాల బంగారు ఆభరణాలు, కారు, మోటారు సైకిళ్లు, ఖరీదైన ఫర్నిచర్ ఇలా ఆదాయానికి మించి ఆస్తులు కూడగట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. కేసు నమోదు చేసి ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.