క్రైమ్/లీగల్

గుర్తు తెలియని మహిళ శవం లభ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోరంట్ల, ఏప్రిల్ 22 : మండల పరిధిలోని సింగిరెడ్డిపల్లి సమీపంలో చిత్రావతి నదిలో గుర్తు తెలియని మహిళ శవం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. శవం కుళ్లిపోయి పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు సమాచారం అందించారన్నా రు. శవం తరలించే స్థితిలో లేకపోవడంతో హిందూపురం నుంచి వైద్యులను పి లిపించి పోస్టుమార్టం నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం అక్కడే అంత్యక్రియలు నిర్వహించారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
గుర్తుతెలియని శవం లభ్యం
తనకల్లు, ఏప్రిల్ 22: మండల పరిధిలోని చీకటిమానిపల్లి పరిసరాల్లో జాతీయ రహదారి పక్కన ఆదివారం గుర్తుతెలియని శవం లభ్యమైంది. స్థానికులు కనుగొని ఎస్‌ఐ శ్రీనివాసులు సమాచారం అందించారు. రెండు రోజులుగా రోడ్డు పక్కన శవం కంప చెట్లలో వుందని, దుర్వాసన రావడంతో ఆదివారం గ్రామస్థులు పరిశీలించగా గుర్తుతెలియని శవం లభ్యమైంది. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు దొరకలేదని, మృతుడు నల్ల ప్యాంట్, గీతల చొక్కా ధరించి వున్నాడని, సుమారు 40 సంవత్సరాలు ఉంటాయని ఎస్‌ఐ తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
అతిగా మద్యం తాగి వ్యక్తి మృతి
గోరంట్ల, ఏప్రిల్ 22 : స్థానిక ఎండాలబండ వీధికి చెందిన నాగభూషణం (41) అతిగా మద్యం తాగి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెనుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
పట్టుబడ్డ చైన్‌స్నాచర్
అనంతపురం అర్బన్, ఏప్రిల్ 22: వివాహిత మెడలో తాళిబొట్టు, బంగారం గొలుసును లాక్కొని పరుగులు తీస్తున్న నిందితుడిని స్థానికులు వెంటాడి పట్టుకొని దేహశుద్ధి చేశారు. పోలీసులకు సమాచారం అందించగా సంఘటనా స్థలానికి చేరుకొన్న రెండవ పట్టణ ఎస్‌ఐలు శివగంగాధర్‌రెడ్డి, శ్రీరామ్, బ్లూకోల్ట్స్ నిందితుని అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. ఎస్‌ఐ శివగంగాధర్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు నగరంలోని జీసస్ నగర్‌కు చెందిన చెందిన వివాహిత రమాదేవి ఆదివారం ఉదయం 7గంటల సమయంలో తన ఇంటి ముందు పువ్వులు కోస్తుండగా నిందితుడు జయకృష్ణ ఆమె మెడలోని మూడు తులాల బంగారం, తాళిబొట్టు చైన్‌ను లాక్కొని పారిపోవటం జరిగిందన్నారు. తక్షణమే స్థానికులు స్పందించి నిందితున్ని పట్టుకోవటం జరిగిందన్నారు. నిందితుడు స్వగ్రామం విడపనకల్లు మండలం కొట్టాలపల్లి గ్రామం. నగరంలోని ఎస్‌ఎస్‌బీఎన్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేయటం జరిగిందన్నారు. సాయినగర్‌లోని రెండవ క్రాస్‌లో తన అక్క ఓ గర్ల్స్ హాస్టల్ నిర్వహిస్తుండగా నిందితుడు తన అక్కకు సహాయంగా ఉంటూ ఉద్యోగానే్వషణలో కాంపిటీషన్ పరీక్షలకు సిద్ధం అవుతున్నాడన్నారు. ఇదే సందర్భంలో జల్సాలకు అలవాటుపడటం డబ్బు సంపాధన కోసం చైన్‌స్నాచింగ్‌కు పాల్పడటం జరిగిందన్నారు. నిందితునిపై గతంలో ఎలాంటి కేసులు లేవన్నారు. రమాదేవి ఫిర్యాదు మేరకు జయకృష్ణపై చైన్‌స్నాచింగ్ కేసును నమోదు చేసి కోర్టుకు హాజరుపర్చటం జరిగిందన్నారు.