క్రైమ్/లీగల్

రౌడీషీటర్ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికిందరాబాద్, ఏప్రిల్ 22: సికిందరాబాద్ రేతిఫైల్ బస్‌స్టేషన్ ప్రాంతంలోని వైన్‌షాప్ ముందు ఆదివారం ఉదయం రౌడీషీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. అందరూ చూస్తుండగానే ఆరుగురు వ్యక్తులు మూకుమ్మడిగా దాడి చేసి కత్తులు, కర్రలు, రాళ్లతో కొట్టి దారుణంగా హతమార్చారు. తీవ్ర సంచనలం సృష్టించిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.. తార్నాక మాణికేశ్వరినగర్ ప్రాంతానికి చెందిన సయ్యద్ ఫరీద్ (26) వృత్తి రీత్యా ఆటోడ్రైవర్. కాగా ఇతను కరడుగట్టిన నేరస్థుడు. ఇతనిపై హత్య, హత్యాయత్నం, దొంగతనం, దోపిడీ, గంజాయి విక్రయం తదితర కేసులు నమోదయ్యాయి. ఇతను మద్యం సేవించాడంటే అసలు మనిషేకాడు. అకారణంగా గొడవలు పడుతూ అడ్డువచ్చిన వారిపై దాడులకు తెగబడతాడు. ఇతనిపై లాలాగూడ, చిలకలగూడ, గోపాలపురం పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో17కు పైగా కేసులు నమోదయ్యాయి. జైలు జీవితం గడిపి వచ్చినప్పటికీ అతని ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. ఇతని ప్రవర్తనతో విసిగిపోయిన భార్య కూడా ఇతని నుంచి దూరంగా ఉంటుంది. పోలీసులు పట్టుకోవడానికి వస్తే తన వద్ద వున్న బ్లేడుతో కోసుకుంటాడు. తలను బండరాయికేసి కొట్టుకుంటూ హింసించుకుంటాడు. చికిత్స నిమిత్తం ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రిలో సైతం చికిత్స తీసుకున్నాడు. కాగా హత్య జరిగిన ప్రాంతాన్ని ఏసీపీ శ్రీనివాస్‌రావు, గోపాలపురం ఇన్‌చార్జ్ ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ సందర్శించి క్లూస్‌టీమ్‌లను రప్పించి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఫరీద్ హత్యకు పాత కక్షలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. రెజిమెంటల్ బజార్ ప్రాంతానికి చెందిన నర్సింహను ప్రధాన నిందితుడిగా పోలీసులు అనుమానిస్తూ.. అతనితోపాటు ఉన్న మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. గతంలో నర్సింహ సోదరుడిని ఫరీద్ చంపుతానని బెదిరించిన నేపథ్యంలో పథకం ప్రకారం ఈ హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తు ఆ కోణంలో దర్యాప్తును వేగవంతం చేశారు.