క్రైమ్/లీగల్

లోక్ అదాలత్‌లో 12,842 కేసులు పరిష్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 22: జాతీయ లీగల్ సర్వీసస్ అధారిటీ మార్గదర్శకాల మేరకు ఆదివారం ఇక్కడ తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ జాతీయ లోక్ అదాలత్‌ను నిర్వహించినట్లు అథారిటీ మెంబర్ సెక్రటరీ బి ఆర్ మధుసూదనరావు తెలిపారు. ఇందులో 12,842 కేసులను పరిష్కరించగా వాటిలో 6988 ప్రీ లిటిగేషన్ కేసులు, 5854 కోర్టు పెండింగ్ కేసులు ఉన్నాయని తెలిపారు. ఈ సందర్భంగా రూ. 56.02 కోట్ల పరిహారాన్ని అందజేసినట్లు చెప్పారు. జిల్లా లీగల్ సర్వీసస్ అథారిటీల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, అథారిటీ ఎగ్జిక్యుటివ్ చైర్మన్ జస్టిస్ వి రామసుబ్రహ్మణియన్, హైకోర్టు కమిటీ చైర్మన్ జస్టిస్ పివి సంజయ్ కుమార్ తదితరుల సహకారం, అండదండలతో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినట్లు ఆయన చెప్పారు.