క్రైమ్/లీగల్

క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకుల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప క్రైం,ఏప్రిల్ 24: క్రికెట్ బెట్టింగ్‌లు నిర్వహిస్తూ , ప్రజలను జూదానికి బానిసలు చేస్తున్న తొమ్మిది మంది బెట్టింగ్ నిర్వాహకులను అరెస్టు చేసినట్లు కడప డీఎస్పీ మాసూంబాషా వెల్లడించారు. మంగళవారం డీఎస్పీ కార్యాలయంలో ఆయన పాత్రికేయుల సమావేశం ఏర్పాటుచేసి 9మందిని విలేఖర్ల ఎదుట ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ప్రొద్దుటూరు టౌన్‌కుచెందిన కటిక సులేమాన్, షేక్ మహ్మద్, ఎర్రగుంట్ల మండలం ఉరుటూరుకు చెందిన సొదుం రమేష్‌కుమార్‌రెడ్డి, వలసపల్లెకు చెందిన రాజోలి బయపురెడ్డి, కర్చుకుంట పల్లెకు చెందిన బొందల వెంకటేష్, చిలంకూరుకు చెందిన పుల్లాసి గురుప్రసాద్, ఎర్రగుంట్ల టౌన్‌కు చెందిన చింతల వెంకట ప్రసాద్, పిల్లగోయిల శ్రావణ్‌కుమార్‌లను అరెస్టుచేసినట్లు ఆయన తెలిపారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న ఎర్రగుంట్ల ఎస్‌ఐ జె.శివశంకర్, పెండ్లిమర్రి ఎస్‌ఐ షేక్ రోషన్, కడప తాలూకా ఎస్‌ఐ రాజరాజేశ్వరిరెడ్డిలు, వ్యూహాత్మకంగా చిలంకూరు గ్రామంలోని పుల్లాసి గురుప్రసాద్‌కు చెందిన ‘ప్రసాద్ హోటల్’లో వీరందర్నీ పట్టుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. పోలీసులను చూడగానే వారి వద్ద వున్న గంజాయి సంచి, పట్టిలు, డబ్బులు వదిలేసి పారిపోబోగా వెంటాడి పట్టుకున్నట్లు తెలిపారు. సమీపంలోనే ఉన్న ఏపీ 04 ఏఎం 7793 నెంబర్ గల వాహనంలో పారిపోయేందుకు ప్రయత్నం చేయగా పోలీసు అధికారులు,సిబ్బంది వాహనాన్ని చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారని డీఎస్పీ తెలిపారు. వారివద్దవున్న 16సెల్‌ఫోన్లు, రూ.8,98,500లు నగదును స్వాధీనం చేసుకున్నారని, సుమారు 1150గ్రాముల గంజాయిని, కారు, స్లిప్‌ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మొత్తం విలువ రూ.19,28, 500 విలువ ఉంటుందని డీఎస్పీ తెలిపారు.
సిబ్బందికి ప్రశంసలు
క్రికెట్ బెట్టింగ్ దారులను అదుపులోకి తీసుకుని అరెస్టుచేసిన ఎర్రగుంట్ల, పెండ్లిమర్రి, కడప తాలూకా ఎస్‌ఐలను ఎర్రగుంట్లసిబ్బంది పాములేటి, కె.నాగాంజనేయులును డీఎస్పీ ప్రశంసించారు.