క్రైమ్/లీగల్

పిడుగుపాటుకు వ్యక్తి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీరఘట్టం, ఏప్రిల్ 24: మండలంలోని పనసనందివాడ గ్రామంలో మంగళవారం పిడుగుపడి పాలకొండలోని నెయ్యిలవీధికి చెందిన పులిపుట్టి దుర్గారావు (45) అనే వ్యక్తి మృతి చెందారు. గ్రామంలోని వివాహ శుభకార్యానికి వంట చేసేందుకు వచ్చిన దుర్గారావు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో భారీ వర్షం కురవడంతో సర్పంచ్ కొరికాన సన్యాసినాయుడుతో పాటు పలువురితో కలిసి గ్రామ సమీపంలోని పాఠశాల భవనంలోకి వెళ్లారు. అయితే వర్షం తగ్గిన తర్వాత మూత్రవిసర్జన కోసం అక్కడే ఉన్న మరో భవనం వెనుకకు వెల్లాడు. ఇంతలో పెద్ద మెరుపుతో కూడిన పిడుగుపడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య ఎర్రమ్మతో పాటు కుమరుడు, కుమార్తె, తల్లిదండ్రులు ఆదెమ్మ, ఎర్రయ్యలు ఉన్నారు. సమాచారం తెలుసుకున్న వెంటనే స్థానిక ఎస్ ఐ జి.అప్పారావు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి పంచనామా జరిపి పాలకొండ ఏరియా ఆసుపత్రికి పోస్టుమార్టమ్ నిమిత్తం తరలించారు. అంతవరకు తమతో మాట్లాడుతున్న దుర్గారావు క్షణాల్లోనే పిడుగుపాటుకు గురై మరణించడం గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. గత కొంతకాలం నుంచి తమ గ్రామాలకు వంటలు కోసం వచ్చి మంచి అనుబంధం కలిగి ఉన్న దుర్గారావు మరణించడం తమను ఎంతగానో కుంగదీసిందని సర్పంచ్‌తో పాటు గ్రామస్తులు తెలిపారు.
పిడుగుపాటుకు మహిళ మృతి
రేగిడి, ఏప్రిల్ 24: మండలంలోని ఖండ్యాం గ్రామానికి చెందిన తార జయమ్మ (42) అనే మహిళ మంగళవారం ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగుపాటుకు మృతి చెందింది. ఉదయం యథావిధిగానే భర్తతో పాటు పంట పొలాల్లో పశువులను మేపుతుంది. మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై భారీ వర్షం కురవడంతో భయపడి పశువులు తోలుకొని ఇంటిదారి పట్టింది. అయినాసరే మృత్యువు పిడుగు రూపంలో ఆమెను కబళించింది. పశువులను తోలుకొని వస్తుండగా మార్గమధ్యంలోని ఆమెపై పిడుగుపడడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలికి భర్తతో పాటు ఇద్దరు పిల్లలున్నారు. మృతదేహాన్ని రాజాం సామాజిక ఆసుపత్రికి పోస్టుమార్టమ్ నిమిత్తం తరలించారు. దీనిపై రేగిడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.