క్రైమ్/లీగల్

ఏసీబీ వలలో మున్సిపల్ బిల్ కలెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు ఓల్డ్‌సిటీ, ఏప్రిల్ 24: కర్నూలు నగర పాలక సంస్థలో పని చేస్తున్న బిల్లు కలెక్టర్ ఎస్.సుధాకర్ కొళాయి కనెక్షన్ కోసం రూ.5వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి... కల్లూరులోని సాయి విద్యానికేతన్ ఇంగ్లీషు మీడియం స్కూల్ యజమాని నాగలక్ష్మిదేవి కొళాయి కనెక్షన్ కోసం కల్లూరు ఏరియాకు చెందిన మున్సిపల్ బిల్లు కలెక్టర్ ఎస్.సుధాకర్‌ను కలిసింది. అయితే ఆయన ఇంటిపన్ను బిల్లు కట్టార అని ఆమెను అడగ్గా తమకు పన్ను ఇవ్వలేదని చెప్పింది. దీంతో ఇంటిపన్నుతోపాటు కొళాయి కనెక్షన్ ఇచ్చేందుకు రూ.5వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో ఆమె తరపున రవికుమార్ అనే వ్యక్తి ఏసీబీ అధికారులకు రాత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో ఏసీబీ అధికారులు పథకం ప్రకారం బాధితురాలు బిల్లుకలెక్టర్‌కు డబ్బు ఇస్తామని చెప్పడంతో మంగళవారం స్థానిక శ్రీరామ థియేటర్ వద్దకు డబ్బులు తీసుకొని రమ్మనగా ఏసీబీ అధికారులు వలపన్ని మధ్యాహ్నం 12.30 గలకు రవికుమార్ నుండి బిల్లు కలెక్టర్ సుధాకర్ రూ.5వేలు లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ జయరామజరాజు, సీఐ నాగభూషణం, సిబ్బంది పాల్గొని కేసు నమోదుచేసి రిమాండ్‌కు తరలించారు.