క్రైమ్/లీగల్

లబ్ధిదారుల జాబితా ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 24: వివిధ ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి 600 నోటిఫికేషన్లలో భూములు కోల్పోయిన వారికి నష్టపరిహారం మంజూరుపై ఏప్రిల్ 30వ తేదీ లోపల లబ్ధిదారుల జాబితాను రూపొందించాలని హైకోర్టు ఆంధ్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. భూసేకరణ వల్ల నష్టపోయిన కుటుంబాల జాబితాను రూపొందించడంలో ఏపి ప్రభుత్వాధికారులు అవలంభించిన వైఖరిని హైకోర్టు తప్పుబట్టింది. ఇంతవరకు ఏ మేరకు బెనిఫిట్లను కల్పించారో వివరాలు అందించారో జాబితాను రూపొందించాలని ఆదేశించింది. ఏపి వ్యవసాయ వర్కర్ల యూనియన్ కార్యదర్శి వెంకటేశ్వర్లు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం విచారించింది. ఈ పిటిషన్‌ను విచారించిన తర్వాత తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ కె విజయ లక్ష్మి పై ఆదేశాలను జారీ చేశారు. సరైన పునరావాస సదుపాయాలు, ప్యాకేజీ ఇవ్వలేదని పిటిషనర్ పిల్‌లో పేర్కొన్నారు. అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ, గతంలో ఇచ్చిన హామీ మేరకు భూసేకరణ వల్ల నష్టపోయిన కుటుంబాలను గుర్తిస్తామని తెలిపారు. ఏజి సమాధానంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. 2013 భూసేకరణ చట్టం అమలు, అవార్డుల మంజూరు, భూములు కోల్పోయినన వారి జాబితా, వారికి నష్టపరిహారం చెల్లింపు వివరాలు తమకు ఎలా తెలుస్తాయని హైకోర్టు ప్రశ్నించింది. కోర్టుకు వివరాలు సమర్పించని పక్షంలో ఏమి చేయాలో కోర్టుకు తెలుసని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. చింతలపూడి ప్రాజెక్టుకు 47 ఎకరాలు సేకరిస్తామని నోటిఫికేషన్ జారీ చేశామని, అభ్యంతరాలపై నోటిఫికేషన్ ఇచ్చామని, ఎవరూ కూడా అభ్యంతరం తెలియచేసేందుకు ముందుకు రాలేదని ఏజి కోర్టుకు తెలిపారు. కాగా ఈ విషయమై ఇంటి సర్వే నిర్వహించాలని ఆదేశిస్తూ కోర్టు ఈ కేసు విచారణను వాయిదా వేసింది.