క్రైమ్/లీగల్

అత్యాచార బాధితుల పేర్లు వెల్లడించవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: అత్యాచార బాధితులు వివరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ వెల్లడించడానికి వీల్లేదని సుప్రీం కోర్టు నిర్ద్వంద్వంగా తేల్చిచెప్పింది. చివరికి మరణించినవారికి కూడా గౌరవం ఉంటుందని, వారిని బజారుకు ఈడ్చడానికి వీలులేదని, అత్యాచార బాధితుల వివరాలు వెల్లడికి సంబంధించి అంశాన్ని విచారించిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. జమ్మూకాశ్మీర్‌లోని కథువాలో ఇటీవల ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం, హత్య నేపథ్యంలో సుప్రీం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. బాధితులు బతికే ఉన్నా, వారు మైనర్లే అయినా, దివ్యాంగులైనా కూడా వారి వివరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ వెల్లడించవద్దని స్పష్టం చేసింది. ఎందుకంటే వీరి జీవన హక్కుకు భంగం కలిగించరాదని, ఒకవేళ వారి పేర్లు వెల్లడిస్తే వారి అనంతర జీవనం మచ్చబారిపోతుందని అలా బయటపడిపోయిన బాధ జీవితాంతం వారిని వెన్నాడుతునే ఉంటుందని కోర్టు తెలిపింది. న్యాయమూర్తులు మదన్ బీ లోకూర్, దీపక్ గుప్తాతో కూడిన బెంచ్ బాధితుల వివరాలు ఎందుకు వెల్లడించకూడదో వివరిస్తూ ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. బాధితుల తల్లిదండ్రులు అంగీకరించినప్పటికీ కూడా దగాపడ్డ ఆ పిల్లలు ఎందుకు వెల్లడించకూడదో స్పష్టం చేసింది. వ్యక్తి మానసిక స్థితిగతులు ఎలా ఉన్నా ప్రతి ఒక్కరికీ గోప్యత హక్కు ఉంటుందని, అత్యాచార బాధితుల విషయంలో ఈ హక్కుకు ఎట్టిపరిస్థితుల్లోనూ భంగం కలిగించకూడదని రూలింగ్ ఇచ్చింది.