క్రైమ్/లీగల్

కోర్టుకు హాజరైన పతంజలి సీఈఓ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్ టౌన్, ఏప్రిల్ 24: నాన్ బెయలేబుల్ వారంట్ జారీతో పతంజలి ఉత్పాదకాల సీఈఓ ఆచార్య బాలకృష్ణ మంగళవారం మెదక్ మొదటి అదనపు కోర్టుకు హాజరయ్యారు. పతంజలి ఉత్పాదకాల్లోను బకూచి చూర్న, స్ర్తి రసాయన్ వాటి ఔషధాలను ఎందుకు వాడాలనే అంశాలను ముద్రించినందున డ్రగ్ అండ్ మ్యూజిక్ రిమేడిస్ 1954 చట్టం ప్రకారం జిల్లా డ్రగ్ ఇన్స్‌పెక్టర్ 2015లో పతంజలి ఉత్పాదకులు దివ్య ఫార్మసీ, పతంజలి ఉత్పాదకాల సంస్థ సీఈఓ ఆచార్య బాలకృష్ణలపై కేసులు నమోదు చేశారు. ఈ కేసులో పలుమార్లు కోర్టుకు హాజరు కావాలని నోటీసులు పంపినప్పటికీ సీఈఓ ఆచార్య బాలకృష్ణ తన తరఫు న్యాయవాదిని పంపారు. కానీ ఆయన స్వయంగా కోర్టుకు హాజరు కాలేదు. దీంతో న్యాయస్థానం నాన్ బెయలేబుల్ వారంట్ జారీ చేసింది. ఈ మేరకు ఆయన మంగళవారం తన న్యాయవాదితో కలిసి మెదక్ కోర్టుకు హాజరయ్యారు. పతంజలి ఉత్పాదకాల సంస్థ పనుల విషయంలో బిజీగా ఉండటంతోనే కోర్టుకు తాను స్వయంగా హాజరు కాలేదని పతంజలి ఉత్పాదకాల సీఈఓ ఆచార్య బాలకృష్ణ పేర్కొన్నారు.