క్రైమ్/లీగల్

ఆశారాంకు జీవిత ఖైదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జోధ్‌పూర్, ఏప్రిల్ 25: బాలికపై అత్యాచారం కేసులో బాబా ఆశారాం బాపును జోధ్‌పూర్ ఎస్సీ,ఎస్టీ ప్రత్యేక కోర్టు దోషిగా నిర్ధారించింది. ఆశారాంకు జీవిత ఖైదును విధిస్తూ కోర్టు తీర్పును బుధవారం ప్రకటించింది. ఆయన అనుచరులు ఇద్దరికి చెరో 20 ఏళ్ల జైలుశిక్ష విధించారు. శారద్, శిల్పి అనే అనుచరులకు ఒక్కొక్కరికి ఇరవై ఏళ్లు జైలు శిక్ష వేస్తూ అడిషనల్ సెషన్స్ జడ్జి మధుసూదన్ శర్మ తీర్పును ప్రకటించారు. శివ, ప్రకాశ్ అనే ఇద్దరు అనుచరులను కోర్టు నిర్దోషులుగా విడుదల చేసింది. ఆశారాం, అతడి అనుచరులపై ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. పోక్సో చట్టం కింద అభియోగాలు నమోదుచేశారు. జోధ్‌పూర్ జైలు ప్రాంగణంలోని ఓ ప్రత్యేక హాలులో న్యాయమూర్తి తీర్పును వెలువరించారు.‘ఆశారాం బాపునకు కోర్టు జీవిత ఖైదు విధించింది. ఆయన అనుచరులు శారద్, శిల్పికి ఒక్కొక్కరికి ఇరవై జైలు శిక్ష పడింది’అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోకర్‌రాం బిష్ణోయ్ వెల్లడించారు. ముగ్గురు దోషులకు జడ్జి తీర్పును వెలువరించిన తరువాత బిష్ణోయ్ మీడియాతో మాట్లాడారు. ఆశారాం చనిపోయే వరకూ జైలులోనే శిక్ష అనుభవించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. స్వామికి జైలుశిక్షతో పాటు లక్ష రూపాయల జరిమానా విధించారని తెలిపారు. ‘ ఆశారాం ఆధ్యాత్మిక గురువుకాదు. అతడో పాపి. అమాయకురాలికి ఆశ్రమం కల్పించి ఆమె జీవితాన్ని నాశనం చేశాడు. ఆశారాంకు కఠిన శిక్ష, గరిష్ఠంగా విధించాలి’ అని కోర్టును అభ్యర్థించినట్టు బిష్ణోయ్ వెల్లడించారు. శారద్, శిల్పి కూడా కుట్రలో భాగస్వాములని ఆయన స్పష్టం చేశారు. ఆశారాంపై తీర్పు వెలువడుతున్నందున జోధ్‌పూర్ కోర్టు వద్ద భారీగా పోలీసులను మోహరించారు. ఆశారాం మద్దతుదారులు దాడులకు దిగే ప్రమాదం ఉందని రాజస్థాన్ హైకోర్టు హెచ్చరికల నేపథ్యంలో జోధ్‌పూర్ కోర్టు ప్రాగంణంలోనే ఓ ప్రత్యేక గదిలో అడిషనల్ సెషన్స్ జడ్జి మధుసూదన్ శర్మ తన తీర్పును ప్రకటించారు. జోధ్‌పూర్ నగరంలో కూడా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. శాంతి భద్రతలకు ఎక్కడా విఘాతం కలగకుండా 144వ సెక్షన్ విధించారు. నగరంలోని
హోటళ్లు, అతిధి గృహాల వద్ద నిఘా ఉంచారు. అతడి అనుచరులు ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు పాల్పడినా ఎదుర్కొనేందుకు బలగాలు సిద్ధంగా ఉంచారు. పట్టణంలోని సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసుల పికెట్లు ఏర్పాటు చేశారు. రైలుమార్గం, రహదారుల వెంట ఆశారాం మద్దతుదారులు ఎవరైనా వస్తున్నారా అన్నదానిపైనా నిఘా పెట్టారు.
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన 16 ఏళ్ల బాలిక నిర్బంధం, అత్యాచారం కేసులో ఈనెల 7నే తుది విచారణ పూర్తయింది. ఆశారాం కేసులో తీర్పును 25న ప్రకటిస్తామని న్యాయమూర్తి ప్రకటించారు. మధ్యప్రదేశ్‌లోని ఛింద్వారా ఆశ్రమంలో బాలిపై ఆశారాం అత్యాచారం చేశాడు. విద్యాబుద్ధులు నేర్పిస్తామని నమ్మబలికి ఆమెను బందీగా చేసి పలుమార్లు ఆ ఘాతుకానికి పాల్పడ్డాడు. 2013 ఆగస్టు 15 రాత్రి జోధ్‌పూర్ సమీపంలోని మనాయ్ ఆశ్రమంలో బాలిపై అత్యాచారం చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు 2013 సెప్టెంబర్ 1న ఇండోర్‌లో అతడిని అరెస్టు చేసి జోధ్‌పూర్ తీసుకొచ్చారు. అప్పటి నుంచీ జోధ్‌పూర్ జైలులో జుడీషియల్ కస్టడీలోనే ఉన్నాడు. ప్రధాన నిందితుడు ఆశారాంతోపాటు నలుగురిపై 2013 నవంబర్ 6న పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. ఆశారాం బెయిల్ కోసం చేయని ప్రయత్నం లేదు. ఏకంగా 12 సార్లు వివిధ కోర్టుల్లో బెయిల్ పిటిషన్లు వేయడం వాటిని కోర్టులు కొట్టివేయడం జరిగింది. జోధ్‌పూర్ కోర్టు ఆరుసార్లు, రాజస్థాన్ హైకోర్టు మూడుసార్లు, సుప్రీం కోర్టు మూడుసార్లు బెయిల్ పిటిషన్లు కొట్టివేశాయి.
చిత్రాలు..ఆశారాం బాపు, ఆశారాం బాపు ప్రధాన అనుచరులు శరద్, శిల్పి