క్రైమ్/లీగల్

ఆధార్ సీడింగ్‌పై కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: మొబైల్ నెంబర్లను ఆధార్‌తో సీడింగ్ చేయడం తప్పనిసరి చేస్తూ కేంద్రం ఇచ్చిన ఆదేశాలపై, బుధవారం సుప్రీంకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. ‘లోకనీతి ఫౌండేషన్’ దాఖలు చేసిన పిల్‌పై గతంలో తానిచ్చిన ఆదేశాలు, జాతి భద్రతను దృష్టిలో ఉంచుకొని చేసినవన్న కోణంలో పరిగణలోకి తీసుకోవాలని కోరింది. ఆ ఒక్క సందర్భంలో తప్ప నిజానికి అటువంటి ఆదేశాలు ఎన్నడూ ఇవ్వలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సిమ్‌కార్డు ఎవరిపేరునైతే ఉన్నదో వారికి మాత్రమే దాన్ని అప్పగించాలన్న ప్రభుత్వ ఉద్దేశం చట్టబద్ధమైనదని యుఐడిఐ తరపున వాదనలు వినిపిస్తున్న రాకేశ్ ద్వివేది పేర్కొన్నారు. ఆధార్ పథకాన్ని అనుచితమైన రీతిలో అప్రదిష్ట పాలు చేయడానికి యత్నిస్తున్నారన్నారు. నిజానికి బ్యాంకులు, టెలికాం కంపేనీలే పెద్ద మొత్తంలో వినియోగదారుల సమాచారాన్ని కలిగివున్నాయన్న అంశాన్ని ద్వివేది గుర్తు చేశారు. చివరకు యుఐడీఐలో దేశ పౌరుల భద్రతకు ఏవిధమైన ఆటంకం వాటిల్లడంలేదని స్పష్టం చేస్తూ ద్వివేదీ తన వాదనలను ముగించారు.