క్రైమ్/లీగల్

ల్యాండ్ మాఫియా హల్ చల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, ఏప్రిల్ 25: మాదాపూర్ పోలీసు స్టేషన్‌కు కూత వేటు దూరంలోని సైబర్ హిల్స్ కాలనీలో ల్యాండ్ మాఫియా రెచ్చిపోయింది. రెండు దశాబ్దాల నుంచి పొజిషన్‌లో ఉన్న భూమి యజమానులను భయపెట్టి బలవంతంగా స్థలాన్ని ఖాళీ చేయించేందుకు మరణాయుధాలతో బీభత్సం సృష్టించారు. పెట్రోలింగ్ పోలీసులు సమక్షంలో మరణాయుధాలతో స్థలంలో నివాసముంటున్న కూలీలపై దాడి చేయడంతో పాటు గుడిసెలను, గదులను కూల్చివేశారు. తీవ్ర సంచలన సృష్టించిన కేసుకు సంబంధించి బాధితులు,పోలీసులు తెలిపిన వివరాలు ఇలాఉన్నాయి. శేరిలింగంపల్లి మండలం గుట్టల బేగంపేట సర్వే నెంబర్ 30, 31లో ఆర్‌సీ మిశ్రా, రామకృష్ణా రెడ్డి, మధుసూదన్ రెడ్డికి 1400 గజాల స్థలం ఉంది. సర్వే నెంబర్ 30, 31లో 1971లో జహింద్ రెడ్డి అనే వ్యక్తి లేఔట్ చేసి ప్లాట్లులు విక్రయించారు. 1996లో జగనాథ్ రెడ్డి నుంచి ముగ్గురు కొనుగోలు చేశారు. 1996 నుంచి ప్రహరీ, రూములు నిర్మించుకుని ముగ్గురు యజమానులు పొజిషన్‌లో ఉన్నారు. కరెంట్, మంచినీటి కనెక్షన్, హౌస్ ట్యాక్స్ చెల్లిస్తున్నారు. గదులతో పాటు ఖాళీ స్థలంలో కొందరు కూలీలు గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నా రు. మంగళవారం రాత్రి గుర్తుతెలియని కొందరు దుండగులు మరణాయుధాలతో వచ్చి నివాసముంటున్న కూలీలపై దాడికి దిగి విచిక్షణారహితంగా కొట్టి స్థలం ఖాళీ చేయాలని భయబ్రాంతులకు గురిచేశారు. గుడిసెవాసుల్లో కొందరు బాలింతలు, చిన్నపిల్లలు, వృద్ధులు ఉన్నప్పటికీ కనికరం లేకుండా బలవంతంగా స్థలాన్ని ఖాళీ చేయాలని దాడి చేశారు. పోలీసులకు, స్థలం యజమానులైన మిశ్రాకు, రామకృష్ణా రెడ్డి, మధుసుదన్ రెడ్డికి సమాచారం అందించారు. 100 ఫోన్ చేస్తే పెట్రోలింగ్ పోలీసులు వచ్చి కబ్జాదారులకే వత్తసు పలుకుతూ తమని ఖాళీ చేసి వెళ్లాలని భయపెట్టారని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. రెండు దశాబ్దల నుంచిడి పొజిషన్‌లో ఉన్న తమపై దాడి చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. తమనే బెదిరించడం ఎంత వరకు న్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. 2017లో కూడా శ్రీనివాస్ రావు అనే వ్యక్తి తమ భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నిచాడని, ఆ సమయంలో విచారణ చేసిన పోలీసులు.. భూమి తమదేనని పొజిషన్ ఖాళీ చేయవద్దని చెప్పారని స్థలం యజమానులు పేర్కొన్నారు. తమపై జరిగిన దాడి విషయాన్ని సైబరాబాద్ సీపీ, మాదాపూర్ డీసీపీ, మాదాపూర్ ఏసీపీ దృష్టికి తీసుకెళ్లామని బాధితులు తెలిపారు.