క్రైమ్/లీగల్

నాటు తుపాకీ స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఏప్రిల్ 27: అటవీప్రాంతంలో అనుమతిలేని రిజర్వ్ ఫారెస్ట్‌లో వన్యప్రాణులు వేటాడే ముఠాలోని ఒక వ్యక్తిని పట్టుకుని అతని నుండి నాటుతుపాకీ, మం గుండు స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్‌పోర్స్ డీఎస్పీ హరినాథ్‌బాబు తెలిపారు. బుధవారం రాత్రి వాసు ఆధ్వర్యంలోని టాస్క్ఫోర్స్ సిబ్బంది దేవరకొండ నుండి దెయ్యాలకోన వరకు కూంబింగ్ చేశారు. ఈ సమయంలో ముగ్గురు వ్యిక్తులు అడవిలోకి పారిపోతుండడాన్ని గుర్తించి సిబ్బంది వారిని పట్టుకునేందుకు వెంటాడారు. ఈ సమయంలో ఒక వ్యక్తి టాస్క్ఫోర్ సిబ్బందికి పట్టుబడ్డాడు. ఆ వ్యక్తిని సిబ్బంది విచారించగా బాకరాపేట చిట్టేచెర్ల కొత్తపల్లికి చెందిన చరణ్‌గా గుర్తించారు. పట్టుబడిన నిందితుడి నుంచి నాటుతుపాకీ, నల్లమందు, ఇనుప చువ్వలు, సీసం, వేటకు ఉపయోగించే వల, గంజాయి, వంటసామాగ్రి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మిగిలిన వారిని త్వరలో అరెస్ట్ చేస్తామని డీఎస్పీ చెప్పారు.