క్రైమ్/లీగల్

పోలీసుల విచారణలో ఉన్న దివ్యాంగుడి ‘ఆత్మహత్య’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అచ్చంపేట, ఏప్రిల్ 27: కోళ్లను దొంగిలించాడన్న కేసు విచారణ ఎదుర్కొంటున్న నిందితుడు శుక్రవారం కొండూరులోని తన ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన వివరాలను కుటుంబ సభ్యులు ఇలా వివరించారు... గ్రామానికి చెందిన పులి తిరుపతిరాజు, పులి వీరరాజు, గురవారావుకు చెందిన పది కోళ్లు అదృశ్యమైనట్లు 15 రోజుల క్రితం అచ్చంపేట పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారన్నారు. ఈ క్రమంలో కేసులో అనుమానితుడైన దివ్యాంగుడు చొప్పవరపు బాలయ్య (30)ను ఎస్‌ఐ కిరణ్ విచారిస్తున్నారు. గురువారం రాత్రి గ్రామంలో పెద్దల రాజీ ప్రయత్నంలో బాలయ్యకు లక్ష రూపాయలు చెల్లించాలని తీర్పుచెప్పారు. అంతపెద్ద మొత్తం చెల్లించుకోలేనని బాలయ్య వేడుకున్నప్పటికీ ప్రయోజనం కనిపించలేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తంచేశారు. శుక్రవారం ఉదయం దివ్యాంగుడైన బాలయ్య ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య నాగమ్మ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. డీఎస్పీ కాలేషావలి సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతదేహాన్ని సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాలకు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అచ్చంపేట ఎస్‌ఐ కిరణ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈయన వెంట క్రోసూరు ఎస్‌ఐ సురేష్ ఉన్నారు. ఇలా ఉండగా బాలయ్య మృతదేహాన్ని పెదకూరపాడు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త కావటి శివనాగ మనోహర్ నాయుడు సందర్శించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడిన అనంతరం ఆయన విలేఖర్లతో మాట్లాడారు. దివ్యాంగుడని కూడా చూడకుండా అధికార పార్టీ నాయకులు తీవ్రమైన ఒత్తిడి తేవడమే బాలయ్య మృతికి కారణమని ఆయన ఆరోపించారు. మృతుని కుటుంబానికి 20 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటనపై పోలీసులు, గ్రామ పెద్దలతో ఆయన చర్చలు జరిపారు.