క్రైమ్/లీగల్

అంతర్రాష్ట్ర పశువుల దొంగల ముఠా అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తూప్రాన్, ఏప్రిల్ 27: జాతీయ రహదారి ప్రక్కన గల పశువుల దొడ్ల నుండి పశువులు దొంగతనానికి పాల్పడుతున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన అంతరాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేసినట్లు తూప్రాన్ డీఎస్పి రాంగోపాల్‌రావు పేర్కొన్నారు. ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన వివరించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అమ్రా, మురాదాబాద్, గదియ, సంబల్ జిల్లాలకు చెం దిన మోబిన్, అలిజాన్, మిశ్రఫ్, మిసార్, నన్నుసింగ్, అమీర్‌ఖాన్ ము ఠా సభ్యులుగా ఏర్పడి జాతీయ రహదారి సమీపంలో గల పశువులు ఉన్న పశువుల షెడ్‌లను ముందుగా రిక్కి నిర్వహిస్తారని చెప్పారు. కంటెనర్ లారీని రాత్రి డాబా వద్ద ఆపి అర్థరాత్రి వేళలో పశువులషెడ్ వద్దకు వెళ్ళి పశువులను దొంగిలించి హైదరాబాద్‌లోని కబేలాకు విక్రయిస్తారని చెప్పా రు. ఎవరైనా అడ్డు వస్తే దాడి చేయడానికి కత్తులు వారివెంట ఉంటాయని తెలిపారు. ఈ ముఠా 2 నెలల్లో సిద్దిపే ట జిల్లాలోని గజ్వేల్, గౌరారం, మర్కూక్, వరంగల్ జిల్లాలోని లిం గలా, గన్‌పూర్, అదిలాబాద్ జిల్లాలోని నేరేడుగుండా తూప్రాన్, భువనగిరి మండలాల్లో రెండు దొంగతనాలు కలిపి మొత్తం 8 దొంగతనాలు చేశారని చెప్పారు. భువనగిరిలో దొంగతనం చేసిన 26 పశువులను ఉత్తరప్రదేశ్‌లో విక్రయించారని, మిగి తా పశువులను హైదరాబాద్‌కు చెం దిన కబేలా యజమానులు మున్నూరుషేక్ ఇస్మాయల్‌లకు విక్రయించారని చెప్పారు. వీరిద్దరితో పాటు ఆరుగురు నిందితులను అరెస్టు చేశామని వీరి వద్ద ఏడున్నర లక్షల నగదు, 8 కత్తులు, 11 సెల్‌ఫోన్‌లు, 14 పశువు లు, ఒక కంటేనర్ లారీని రికవరీ చేశామని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు చెప్పారు. ఈ దొంగతనం చేదించడంలో కృషి చేసిన గోవర్దన్, నర్సింలులకు రివార్డు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. విలేఖరుల సమావేశంలో సీఐ, ఎస్‌ఐలు పాల్గొన్నారు.