క్రైమ్/లీగల్

పెళ్లి వ్యాన్, ఆటో ఢీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కౌటాల , ఏప్రిల్ 27: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (ట) మండలం లోడ్‌పల్లి గ్రామ సమీపంలో ప్రధాన రహదారిపై శుక్రవారం రాత్రి పెళ్లి వ్యాన్ , ఆటో ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో రెండు వాహనాల్లో ప్రయాణిస్తున్న 15 మంది మహారాష్ట్ర వాసులు గాయాల పాలయ్యారు. మహారాష్టల్రోని వీరూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డోంగర్‌గావ్ గ్రామానికి చెందిన బబ్లు మూన్ వివాహం కౌటాల మండలం ముత్యం పేట గ్రామానికి చెందిన డోంగ్రె కావ్యతో శుక్రవారం జరిగింది. ఈ వేడుకలకు పెండ్లి బాజాలు మోగించేందుకు డోంగర్‌గావ్‌కు చెందిన బృందం మరికొందరు బంధువులు ఎంహెచ్ 34 ఎం 4878 నంబర్ గల మిని వ్యాన్‌లో పెండ్లి కి హాజరై తిరిగి వెళ్తుండగా రాత్రి 8 గంటల సమయంలో డోర్‌పల్లి , కంచర్ పేట గ్రామాల మధ్య మూలమలుపు వద్ద సిర్పూర్ వైపు నుండి కౌటాలకు ఎదురుగా వస్తున్న ఆటో ఢీకొట్టింది. దీంతో పెండ్లి వ్యాన్ మూడు పల్టీలు కొట్టగా ఆటో కూడా రోడ్డు పక్కన బోల్తా పడింది . ఈ సంఘటనలో వ్యాన్‌లో ప్రయాణిస్తున్న 13 మందితో పాటు ఆటోలో ఉన్న ముగ్గురు ప్రయాణీకులు గాయ పాలయ్యారు . క్షత గాత్రులు వీరే ఆటో పెండ్లి వ్యాన్ ఢీ కొన్న ఘటనలో గాయపడ్డవారి వివరాలు ఇలా ఉన్నాయి. ఆటోలో ప్రయాణిస్తున్న కౌటాల మండలం సీర్సా గ్రామానికి చెందిన కోరె బుచ్చయ్య, ఆయన కుటుంబీకులు మరో ఇద్దరు ఉండగా వ్యాన్ లో డోంగర్‌గావ్ కు చెందిన బబ్లు ధుర్యోధన్, బాబురావు, సురేష్ జాడె, లింగా రాంషెట్టి, బాబురావుజల్మెల తలకు చేతులకు తీవ్ర గాయాలు అయ్యాయి. వీరితోపాటు నాందేవ్ మహోల్కర్, శంకర్ జుల్మె, పాండురంగ్ , ప్రదీప్ నగరాడె, దిలీప్ జాడె, సురేష్ సాడె, ఈశ్వర్ ధుర్యోధన్, సంతోష్ ధుర్యోధన్, మోరేశ్వర్ చునార్కర్, కుర్మెట్‌వార్‌లకు గాయాలయ్యాయి. అటోలో గాయపడ్డ వారిని గ్రామస్తులు హుటాహుటిన ప్రైవేట్ వ్యాన్‌లో సిర్పూర్ (టి) ఆసుపత్రికి తరలించగా మిగిలిన క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో ఇ ఎం టి శివ , చంద్ర మోహన్‌లు సిర్పూర్ (టి ) సామాజిక ఆసుపత్రికి తరలించారు.