క్రైమ్/లీగల్

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరకాల, ఏప్రిల్ 27: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం వరంగల్ రూరల్ జిల్లా పరకాల మండలం రాయపర్తి గ్రామంలో చోటు చేసుకుంది. పరకాల ఎస్సై రవీందర్ కథనం ప్రకారం.. రాయపర్తి గ్రామానికి చెందిన చంద్రకర్ (32) ఎంఎస్సీ బీఈడీ చదివాడు. అయితే, చంద్రకర్ గత రెండు సంవత్సరాల నుంచి వారికి ఉన్న రెండు ఎకరాల పొలంలో వ్యవసాయం చేసుకుంటున్నాడు. గత సంవత్సరం మిర్చి పంట వేయగా సరైన దిగుబడి రాలేదని, ఈ సంవత్సరం పత్తి పంట వేయగా సరైన దిగుబడి రాలేదని చెప్పారు. రెండు సంవత్సరాల నుంచి పంటలకు తీసుకున్న అప్పు మూడు లక్షలు కాగా ఎలా తీర్చాలో తెలియక మనోవేదనకు గురై ఈనెల 19న ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగగా గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం పరకాలలోని సంతోష్ ఆసుపత్రికి తీసుకొచ్చి.. అక్కడ నుండి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు చికిత్స నిమిత్తం తీసుకు వెళ్తుండగా మార్గ మధ్యలో ఉప్పల్ బస్ డిపో దగ్గర చనిపోయినట్లు తెలిపారు. మృతునికి భార్య, రెండు సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవీందర్ తెలిపారు.