క్రైమ్/లీగల్

ఒంటరి మహిళలే లక్ష్యంగా చోరీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఏప్రిల్ 27: ఇతర ప్రాంతాలకు ప్రయాణించేందుకు ఒంటరిగా ఆర్టీసీ బస్సులు ఎక్కే మహిళల బ్యాగుల్లోని బంగారు ఆభరణాల చోరీలకు పాల్పడుతున్న మహిళా నిందితురాలిని ఇంతేజార్‌గంజ్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. పోలీసులు అరెస్ట్ చేసిన నిందితురాలి నుండి సుమారు 5లక్షల 65వేల రూపయల విలువగల 200.5 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ పోలీస్ కమీషనర్ ఈ అరెస్ట్ సంబందించిన వివరాలను వెల్లడిస్తూ జయశంకర్ జిల్లా గోవిందరావుపేట మండలం పస్రా గ్రామానికి చెందిన కట్రోజు విజయ జీవనోపాధికై తన భర్తతో వరంగల్ నగరానికి వచ్చిన నిందితురాలికి ఇద్దరు పిల్లలు పుట్టన అనంతరం నిందితురాలిని భర్త వదిలి పోవడంతో నిందితురాలు బ్రతుకు దేరువు కోసం బీడీ తయారి కార్మికురాలుగా పనిచేసింది. గత ఏడు సంవత్సరాల క్రితం పెళైన తన కూతురు భర్త మరణించడంతో కూతురుతో పాటు వారి పిల్లలు, తమ కుమారుడిని సైతం తనతోపాటు కలిసి ఉండేదని, దీంతో నింధితురాలికి బీడీ తయారి పని ద్వారా వచ్చే ఆదాయం తనకు సరిపోకపోవడంతో నిందితురాలు సులువుగా డబ్బును సంపాదించాలనే ఆలోచనతో ఆర్టీసీ బస్సులు ఎక్కే క్రమంలో మహిళ చేతుల్లో ఉండే బ్యాగులోని బంగారు ఆభరణాలు చోరి చేసేందుకు ప్రణాళికను రూపొందించుకుంది. ఇందులో భాగంగా నిందితురాలు వరంగల్ బస్‌స్టేషన్ తన చోరీలకు వేదికగా చేసుకుని ఈ నెలలో తొలిసారిగా గోదావరిఖని ప్రాంతానికి చెందిన కాశిపేట వెంకటరాజమ్మ ఖమ్మం జిల్లాకు వెళ్ళేందుకు బస్సు ఎక్కే క్రమంలో నిందితులు సదరు ప్రయాణికురాలు బ్యాగు నుండి పదివేల రూపాయలను చోరీ చేయడం ప్రారంభించింది. ఈ తరహలో నిందితురాలు ఏడు చోరీలకు పాల్పడింది. ఇందులో బాగంగా నిందితురాలు ఈనెలలో ఒంటరిగా బస్సు ఎక్కే మహిళల బ్యాగులోని సుమారు 210.5 గ్రాముల బంగారు ఆభరణాలను చోరి చేయడం జరిగిందని తెలిపారు. శుక్రవారం నిందితురాలు తాను చోరి చేసిన బంగారు అభరణాలను అమ్మేందుకుగాను వరంగల్ చౌరస్తాలో బులియన్ మార్కెట్‌కు వచ్చినట్లుగా ఇంతేజార్‌గంజ్ ఇన్స్‌స్పెక్టర్ రవికుమార్‌కు సమాచారం రావడంతో, ఇన్స్‌స్పెక్టర్ ఆదేశాల మేరకు ఇంతేజార్‌గంజ్ సబ్ ఇన్స్‌స్పెక్టర్ వెంకటకృష్ణ తన సిబ్బందితో వెళ్లి నిందుతురాలిని అదుపులోకి తీసుకుని విచారించగా తాను పాల్పడిన చోరీలను పోలీసుల ఎదుట అంగీకరించింది. నిందితురాలు నుండి పోలీసులు సుమారు 200.5 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాదీనం చేసుకున్నారు. సకాలంలో నిందితురాలిని అరెస్ట్ చేయడంతోపాటు చోరీ సొత్తును స్వాదీనం చేసుకోవడంలో ప్రతిభ కనబరిచిన ఇంతేజార్‌గంజ్ ఇన్స్‌స్పెక్టర్ రవికుమార్, ఎస్సై వెంకట్‌కృష్ణతో పాటు ఇతర పోలీస్ సిబ్బందిని సీపీ రవీందర్ అభినందించారు.