క్రైమ్/లీగల్

యువకుడి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం అర్బన్, ఏప్రిల్ 28: జెరూసలెంకు వెళ్లడానికి వీసా రాలేదని మనస్తాపంతో జి. రాణాప్రతాప్‌కుమార్ (27) తన ఇంట్లో శనివారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. మూడవ పట్టణ ఏఎస్‌ఐ నరసింహులు తెలిపిన వివరాల మేరకు లెక్చరర్ కాలనీలోని ర్యాంబో అపార్ట్‌మెంట్లో రాణాప్రతాప్‌కుమార్ తన తల్లిదండ్రులతో కలసి ఉంటున్నారు. చర్చి ఫాదర్‌గా రెండేళ్లపాటు శిక్షణ తీసుకొని రామచంద్రనగర్‌లో చర్చిలో ఫాదర్‌గా పనిచేస్తున్నారు. మ్యూజిక్ ప్లేయర్ సైతం కావడంతోపాటు ఎప్పుడు ఏకాంతంగా ఉండటం అలవాటు అన్నారు. తన కుటుంబ సభ్యులతోపాటు మిత్రులు జెరూసలెం వెళ్లడానికి వీసాకు దరఖాస్తు చేసుకొన్నారు. అందరికి వీసాలు వచ్చినప్పటికి రాణాప్రతాప్‌కుమార్‌కు వీసా మంజూరు కాకపోవటంతో మనస్తాపం చెంది శనివారం తెల్లవారుజామున తన ఇంట్లో ఉరిపోసుకొని ఆత్మహత్య చేసుకొన్నట్లు ఆయన తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ తెలిపారు.