క్రైమ్/లీగల్

పాల్తూరులో దారుణహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విడపనకల్లు, ఏప్రిల్ 28 : మండల పరిధిలోని పాల్తూరు గ్రామంలో శనివారం అర్ధరాత్రి బోయ పెద్ద వన్నప్ప (55)ను అదే గ్రామానికి చెందిన వన్నూర్‌స్వామి అలియాస్ సుత్తిగాడు దారుణంగా నరికి చంపాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు పాల్తూరు గ్రామానికి చెందిన పెద్ద వన్నప్ప అదే గ్రామంలోని వన్నూర్‌స్వామి అక్కకు, పెద్ద వన్నప్ప ఇంటి వద్ద రస్తా స్థలం విషయంలో సంవత్సరం క్రితం గొడవ జరిగింది. ఈ విషయాన్ని మనస్సులో పెట్టుకుని శనివారం అర్ధరాత్రి సమయంలో బోయ పెద్ద వన్నప్ప వాముదొడ్డిలో నిద్రిస్తుండగా వన్నూర్‌స్వామి దారుణంగా కొడవలితో నరికి దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఉదయం వన్నప్ప ఇంటికి రాకపోవడంతో కుమారుడు వాముదొడ్డి వద్దకు వెళ్లి చూడగా రక్తపు మడుగులో పడి ఉండటం గమణించి కుటుంబీకులుకు, గ్రామస్థులు, పోలీసులకు అందించాడు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఉరవకొండ సీఐ చిన్నగౌస్, పాల్తూరు ఎస్‌ఐ ఖాన్ శవాన్ని పరిశీలించారు. వన్నూర్‌స్వామిపై అనుమానం ఉందని కుటుంబీకులు తెలపగా అతన్ని పోలీసులు విచారించగా నేరం ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.