క్రైమ్/లీగల్

పోలీసుల అదుపులో భూపాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్మూర్, ఏప్రిల్ 28: ఆర్మూర్, మెట్‌పల్లి, నిర్మల్, భైంసా, జగిత్యాల తదితర ప్రాంతాల వ్యాపారులను మోసం చేసి బంగారంతో పరారైన బెంగాలి వర్కర్ భూపాల్ పట్టుబడ్డాడు. ఆర్మూర్ నుంచి పరారైన రెండు రోజులకే భూపాల్‌ను పట్టుకోవడంలో పోలీసులు సఫిలీకృతమయ్యారు. బంగారు ఆభరణాలు తయారు చేసే బెంగాల్‌కు చెందిన భూపాల్ పలువురు వ్యాపారులను నమ్మించి సుమారు 4 కిలోల బంగారం, 50 లక్షల నగదుతో ఈ నెల 22వ తేదీన ఉడాయించిన విషయం తెలిసిందే. అయితే భూపాల్ పరారి కావడంతో నగల తయారీ కోసం బంగారం ఇచ్చిన వ్యాపారులు లబోదిబోమన్నారు. బాధితులందరూ ఆర్మూర్ పోలీసులను ఆశ్రయించి తమకు న్యాయం చేయాలని కోరారు. దీంతో స్పందించిన ఆర్మూర్ పోలీసులు వెంటనే బృందాన్ని రంగంలోకి దింపింది. ఎస్‌ఐ గోపి, ఐడి పార్టీ పోలీసులు మల్లేష్, రాములుల బృందం బెంగాల్ వర్కర్ భూపాల్ అచూకి కోసం రంగంలోకి దిగారు. పక్కా సమాచారంతో భూపాల్‌ను కటక్‌లో అత్యంత చాకచక్యంగా పట్టుకున్నారు. అతని వద్ద కొంత బంగారం లభించినట్లు సమాచారం. పట్టుబడ్డ భూపాల్‌ను శనివారం రాత్రి ఆర్మూర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చినట్లు తెలిసింది. భూపాల్ వద్ద పెద్ద మొత్తంలో బంగారం రికవరీ చేసే అవకాశం ఉంది. భూపాల్ పరారీ వెనుక ఎవరెవరి హస్తం ఉందన్నది కూడా తేటతెల్లం అవనుంది. ఏది ఏమైనా బెంగాలి వర్కర్ భూపాల్‌ను పట్టుకోవడంలో పోలీసులు విజయం సాధించగా తమ బంగారం తమకు దొరికే అవకాశం ఉందని వ్యాపారులు ఆశతో ఎదురు చూస్తున్నారు.