క్రైమ్/లీగల్

భెల్ హెచ్‌ఐజీ కాలనీలో చోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామచంద్రాపురం, ఏప్రిల్ 28: పట్టపగలే ఇంట్లోకి చొరబడి చోరీకి పాల్పడిన సంఘటన రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. రామచంద్రాపురం భెల్ హెచ్ ఐజీ కాలనీలో క్వార్టర్ నెంబర్ 297లో ఎమ్‌ఎస్ పెరారీ గత 15 ఏళ్లుగా నివాసముంటున్నాడు. అయితే ఇటీవల బంధువుల ఇంట్లో శుభకార్యం ఉండటంతో బ్యాంకు లాకర్‌లో ఉన్న బం గారాన్ని ఇంటికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో శుక్రవారం పని నిమిత్తం పెరారీ, అతని భార్య ఇద్దరూ ఉదయమే బయటకు వెళ్లారు. తిరిగి మధ్యాహ్నం ఇంటికి చేరుకున్నారు. సాయంత్రం రోజువారీగా పెరారీ భార్య పూజ చేసుకునేందుకు పూజగదిలోకి వెళ్లగా అక్కడ ఉండే రెండు బంగారు దేవుడి విగ్రహాలు కనిపించలేదు. అనుమానంతో ఇళ్లంతా పరిశీలించగా రెండు బెడ్‌రూంలలో బీరువాలు తెరిచి కనిపించాయి. మొత్తం తెరిచి చూడగా బ్యాంకు లాకర్ నుండి తీసుకొచ్చి, బీరువాలో భద్రపరిచిన బంగారు నగలు కూడా కనిపించలేదు. దొంగతనం జరిగిందని గ్రహించిన పెరారీ, అతని భార్య ఇళ్లంతా నిషితంగా పరిశీలించారు. కిచెన్ వైపు ఉండే బాల్‌కానీ డోరు తెరిచి కనిపించింది. వెంటనే తేరుకున్న వారు ఇంట్లో ఇంకేమైనా వస్తువులు పోయాయా? అని పరిశీలింగా, రెండు బంగారు విగ్రహాలు, బీరువాలోని నగలు మినహా ఎలాంటివి చోరీకి గురికాలేదని నిర్ధారించుకున్నారు. చోరికి గురైన బంగారం మొత్తం 54 తులాలు ఉంటుందని, పావు కేజీ కరకు ఉండే వెండి విగ్రహాలు కూడా కనిపించడంలేదని బాధితులు తెలిపారు. ఆలస్యంగా చోరీ విషయాన్ని గుర్తించిన బాధితులు శుక్రవారం రాత్రి రామచంద్రాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ సైదులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను అడిగి వివరాలు సేకరించారు. సీఐ రామచంద్రారావు ఆధ్వర్యంలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.