క్రైమ్/లీగల్

బ్యాంకులను మోసం చేస్తున్న.. 16 మంది అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, మే 1: ఫేస్‌బుక్, వాట్స్‌ప్, టెలిగ్రామ్‌లో మీ ఫొటోలకు గానీ.. మీ వివరాలకు భద్రత లేదు. రుణం కోసం బ్యాంకులో ఇచ్చిన పత్రాలకు భరోసా లేదు. వివరాలతో మీకు తెలియకుండా క్రెడిట్ కార్డులు తీసుకుని బ్యాంకులను మోసం చేస్తున్న నాలుగు ముఠాలలోని 16 మందిని సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. మోసాలకు సహకరించిన ఒక బ్యాంక్ ఉద్యోగులతోపాటు జిరాక్స్ పత్రాలపై అటాస్టేషన్ చేసిన గజిటేడ్ ఆఫీసర్‌పైన కేసు నమోదు చేసినట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ తెలిపారు. సైబరాబాద్ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సైబర్ నేరాగళ్ల వివరాలను సీపీ వెల్లడించారు. కడప జిల్లా పులివెంద మండలం కోంపల్లి గ్రామానికి చేందిన పెద్దినేని శివ రామకృష్ణ (35) ప్రకాశం జిల్లాకు చేందిన నోటి బ్రమేశ్వర రావు (25) యాలంగిని నాగ సుబ్రమణ్యం (34) అలపాటి హేమ రామ ప్రసాద్ మాజీ ఎస్‌బీఐ ఉద్యోగి (29) కందుకూరి రోహిన్ కుమార్ (25) బన్నాల ఈశ్వర్‌చారి (30) మస్తాన్ అజిత్ (28) బత్తానీ రవి తేజ (31) ముఠాగా ఏర్పాడి నకిలీ పత్రాలలో క్రెడిట్ కార్డులు తీసుకుని మోసాలకు పాల్పడుతున్నారని చెప్పారు. అలపాటి హేమ రామ ప్రసాద్ గతంలో ఎస్‌బీఐలో పని చేసి స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన తరువాత రత్నకర్ బ్యాంకులో పని చేస్తున్నారు. ముఠాలో ప్రధాన నిందితుడు శివకుమార్.. 33ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుతో రూ. 36.83లక్షలను పొందాడని, దాం తో పాటు నకిలీ పత్రాలతో బజాజ్ ఫైనాన్స్ సంస్థలో రూ.37.89లక్షలు విలువ చేసే టీవీలు, ఏసీలు కోనుగో లు చేసనట్లు సీపీ చెప్పారు. హేమ రామప్రసాద్ బ్యాంకులో ఖాతా రు ణం కోసమో ఇచ్చిన ఫొటోలను ఇతర వివరాలను నిందితుడు ఇచ్చేవా డు. ఫొటోలతో పాటు, ఫేస్‌బుక్‌లోని కొందరి ఫొటోలు వివరాలను సేకరించి నకిలీ పత్రాలు సృష్టించి క్రెడిట్ కార్డులు తీసుకుని జల్సాలు చేసే వారని సీపీ తెలిపారు. గుంటూరుకి చెందిన పార మెడికల్ ఆఫీసర్‌గా పని చేస్తున్నా ఎం.మోషే నిందితుడు ఇచ్చిన జిరాక్స్ పత్రాలను ఆటాస్టేషన్ చేసేవారని సంబందిత అధికారిపై కేసు పెట్టినటు సీపీ వివరించారు. రెండో ముఠాకు చేందిన పీ.ప్రవీణ్ కుమార్ (38) చెల్లాగండ్ల చంద్రశేఖర్ (28) నాగరాజు (34) వెంకటేశ్వర్లు (33) వివిధ పేర్లతో నకిలీ పత్రాలు సృష్టించి ఎస్‌బీఐలో17 క్రెడిట్ కార్డులతో రూ. కోటి 45లక్షల 50వేల రూపాయలను పొందాని సీపీ చెప్పారు. ముడో ముఠాకు చెందిన గండ్ల శివకుమార్ (29) మణికంఠ (పరారీ) మరపల్లి రమేష్ (26) బీఎన్‌రెడ్డి నగర్‌లో నివాసముండే వనస్థల్లిపురం కార్పొరేర్ లక్ష్మిప్రసన్న పేరుతో లక్ష నాలుగు వేల రూపాల విలువ చేసే క్రెడిట్ కార్డు తీసుకున్నట్లు సజ్జనార్ వెల్లడించారు. ఎస్‌బీఐ లోన్ రూ. 12లక్ష విలువ చేసే 12క్రెడిట్ కార్డులు పొందారని సీపీ తెలిపారు. నాలుగో ముఠాకు చెందిన సికింద్రాబాద్ నివాసముండే రవిశంకర్ (పరారీ) ఉకృతి దేవి ప్రసాద్ (21).. ఎస్‌బీఐ బ్యాంకు ల 6.45లక్షల రూపాయల విలువ చేసే మూడు క్రెడిట్ కార్డులు పొందినట్లు సీపీ చెప్పారు. నిందితులు నకిలీ ధ్రువ పత్రాలతో పాటు పేరు మోసిన కంపెనీలల్లో పని చేస్తునట్లు పే స్లీపులను కూడా తయారు చేసేవారిని సీపీ చెప్పారు. బ్యాంకులో అవుట్ సోర్సీంగ్ సిబ్బందిని అందించే డీఎస్‌ఐ, ఇంటర్నేట్ గ్లోబల్ సంస్థలపై కేసులు పెడుతునట్లు సజ్జనార్ చెప్పారు. ఖాతాదారుల సమాచారన్ని బయట వ్యక్తులకు అందించిన వారిపై వారికి సహకరించిన బ్యాంకు అధికారులను కేసులు పెడతామని సీపీ చెప్పారు. నిందితులు రూ. రెండు కోట్ల 39లక్షలు మోసానికి పాల్పడ్డారని వీరి నుంచి రూ. నాలుగు లక్షల నగదును స్వాధీనం చేసుకున్నామని వీరి బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ. 74లక్ష రూపాయలను సీజ్ చేసినట్లు తెలిపారు. నిందితుల నుంచి క్రెడిట్ కార్డు ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు సీపీ వెల్లడించారు. నిందితులను అరెస్టు చేయాడనికి కృషి చేసిన క్రైం డీసీపీ జానకీ షర్మిల, సైబర్ క్రైం ఏసీపీ శ్రీనివాస్, సీఐలు శివకుమార్, శ్రీనివాస్, ఎస్‌ఐ విజయ వర్ధన్‌ను సీపీ అభినందించారు.