క్రైమ్/లీగల్

నీరవ్ మోదీపై సీబీఐ ఛార్జ్‌షీట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 14: పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కాంకు సంబంధించి నీరవ్ మోదీపై సీబీఐ ఛార్జ్‌షీటు దాఖలు చేసింది. ఈ స్కామ్‌లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ మాజీ చీఫ్, ప్రస్తుతం అలహాబాద్ బ్యాంకు సీఈఓగా ఉన్న అనంతసుబ్రహ్మణ్యం, ఎండి ఇతర అధికార్ల పేర్లను కూడా సిబీఐ చార్జషీటులో చేర్చింది. ముంబయి ప్రత్యేక కోర్టులో దాఖలు చేసిన ఈ ఎఫ్‌ఐఆర్‌లో సీబీఐ పంజాబ్ నేషనల్ బ్యాంకుకు చెందిన మరింత మంది అధికార్ల పేర్లను కూడా చేర్చింది. వీరిలో పీఎన్‌బీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు కె.వి బ్రహ్మాజీరావు, సంజీవ్ శరణ్, జనరల్ మేనేజర్ (అంతర్జాతీయ వ్యవహారాలు) నేహల్ అహద్‌లు ఉన్నారు. ఈ స్కామ్‌లో నీరవ్ మోదీ, అతని సోదరుడు నిషాల్ మోదీ, నీరవ్ మోదీ కంపెనీలో పనిచేసే ఎగ్జిక్యూటివ్ సుభాష్ పరబ్‌లు ఏవిధంగా ఈ కుంభకోణానికి కారకులైందీ ఛార్జ్‌షీటులో సీబీఐ స్పష్టంగా వివరించింది. అయితే మెహుల్ ఛోస్కీ పాత్రపై సీబీఐ ప్రస్తుత చార్జ్‌షీటులో పేర్కొనలేదు. గీతాంజలీ గ్రూపునకు సంబంధించి అనుబంధ ఛార్జ్‌షీటును దాఖలు చేసే సమయంలో బహుశా మెహుల్ ఛోస్కీ స్కాం గురించి పేర్కొనే అవకాశముంది. ఈ మొత్తం కుంభకోణానికి సంబంధించి సీబీఐ విడివిడిగా మూడు ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేసింది. కుంభకోణంపై పీఎన్‌బీ, సీబీఐకు ఫిర్యాదు చేయడానికి ముందే మోదీ, చోస్కీలు దేశం విడిచిపెట్టి వెళ్లిపోయారు.