క్రైమ్/లీగల్

రైలు ప్రమాదంలో యువకుడి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొండాపురం, మే 15: కొండాపురం రైల్వేస్టేషన్ సమీపంలో చోటుచేసుకున్న రైలు ప్రమాదంలో యువకుడు మృతిచెందిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. యర్రగుంట్ల జీఆర్పీయఫ్ ఎస్సై వై.శ్రీనివాసులు తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి, అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలం వరదాపల్లె గ్రామానికి చెందిన చంద్రశేఖర్‌నాయుడు కుమారుడు రావి మహతేజ్ (22) బిటెక్ పూర్తిచేశాడు. ఈక్రమంలోనే ఉద్యోగం సాధించడంతో తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుని తిరుపతి నుండి షిర్డిసాయి రైలులో తిరుగు ప్రయాణమయ్యాడు. రైలులో వస్తుండగా రైలు బోగిలోని డోర్‌వద్ద నిలబడి ఉన్న మహతేజ్ ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడి అక్కడికక్కడే మృతిచెందాడు. దీనిపై కేసునమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాసులు తెలిపారు.