క్రైమ్/లీగల్

సిమీ సభ్యులకు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోచి, మే 15: సిమీ నాయకుడు సఫ్దర్ నరోగీతో సహా 18 మంది సిమీ సభ్యులకు ఇక్కడి ఎన్‌ఐఏ ప్రత్యేక న్యాయస్థానం ఏడేళ్ళ కఠిన కారాగార శిక్ష విధించింది. కేరళలో తమ సంస్థ సభ్యులకు అక్రమంగా ఆయుధాల వినియోగంపై వీరు శిక్షణ ఇస్తున్నట్టు 2007లో కనుగొన్నారు. న్యాయమూర్తి ఎడప్పగథ్, నేరస్తులకు యుఏపీఏ, ఈఎస్‌ఏ, ఐపీసీ సెక్షన్ల కింద ఈ శిక్షలను ఖరారు చేశారు. వివిధ సెక్షన్ల కింద నేరస్థులుగా రుజువైనన 13 మందికి, ఒక్కొకరికి రూ.1లక్ష జరిమానా విధించారు. మిగిలిన ఐదుగురికి ఒక్కొకరికి రూ.50,000 జరిమానా విధించారు. శిక్షలన్నీ ఏకకాలంలో అమలు కావాలని ఆయన తీర్పులో పేర్కొన్నారు. నేరస్థుల్లో 14 మంది ఏడేళ్లుగా జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నందువల్ల దీన్ని శిక్షాకాలంగా కోర్టు పరిగణిస్తుందని డిఫెన్స్ లాయర్ చెప్పారు. కాగా స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా (సిమి) సభ్యులపై సాయుధ శిక్షణ ఇస్తున్నారంటూ 2007లో కేరళ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.