క్రైమ్/లీగల్

ఏటీఎం సెంటర్‌లో కార్డుల క్లోనింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, మే 15: జాగ్రత్తగా భద్రపరచవలసిన బ్యాంక్ అధికారుల నిర్లక్ష్యంతో ప్రజల డబ్బు పరుల పాలవుతోంది. ఆర్థిక నేరస్థుల నుంచి సైబర్ నేరగాళ్ల వరకు అందరూ ప్రజల సొమ్ముపై కన్ను వేయడంతో బ్యాంకులో డబ్బు దాచుకోవాలంటే ఖాతాదారులు భయపడుతున్నారు. ఏటీఎం సెంటర్ల వద్ద సెక్యూరిటీ ఏర్పాటు చేయడంలో బ్యాంక్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంలో సైబర్ నేరగాళ్ల కొత్త టెక్నాలజీతో ఖాతాదారుల డబ్బును సులువగా దోచుకుంటున్నారు.
ఏటీఎం కార్డులు క్లోనింగ్ చేసి బ్యాంక్ అకౌంట్‌ల నుంచి డబ్బులు డ్రా చేసుకుంటున్న రోమానియా దేశానికి చెందిన నలుగురు సభ్యుల ముఠాలో ఇద్దరిని సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. రూ.35లక్షల నగదును, సీక్రెట్ కెమెరాలు, భారీ స్థాయిలో ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ తెలిపారు. సైబరాబాద్ కమిషనరేట్ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. రోమానియా దేశానికి చెందిన వాసిలే గాబ్రియేల్ రజ్వన్, బర్సియా అలెగ్జాండర్ మిహై, టీకు బొగ్దాన్ కాస్టినల్, పికా ఉన్ మారియా.. వ్యాపారం పేరుతో ఇండియాకు వచ్చి నగరంలోని హోటళ్లు, పీజీ గెస్ట్‌హౌస్‌లో నివాసముంటూ సెక్యూరీటీ లేని ఏటీఎంలలో కెమెరా ఉన్న క్లోనింగ్ మిషన్‌లను అమర్చారు. ఏటీఎం సెంటర్‌లో డెబిట్ కార్డుల ద్వారా డబ్బులు విత్‌డ్రా చేసిన సమయంలో కార్డుదారుడు పిన్ నెంబర్ టైప్ చేస్తే నిందితులు అమర్చిన క్లోనింగ్ కెమెరాలో రికార్డు అయ్యేది. 24 గంటల తరువాత ఏటీఎం సెంటర్‌లో అమర్చిన క్లోనింగ్ మిషన్‌లను తీసుకెళ్లి, వారి వద్ద ఉన్న ఏటీఎం డూప్లికేట్ ఖాళీ కార్డులో కస్టమర్ డాటాను టెక్నికల్ టూల్స్ ద్వారా పొందుపరచుకొనేవారు. అనంతరం ముంబయిలో వివిధ ఏటీఎం సెంటర్ల ద్వారా విత్ డ్రా చేసుకుని వెస్ట్రన్ యూనియన్ ద్వారా డబ్బును రోమానియా దేశానికి తరలిస్తున్నారు. కూకట్‌పల్లికి చెందిన అనిల్ భార్గవ్ ఖాతా నుంచి ఈనెల 4న లక్ష రూపాయలు విత్‌డ్రా అయినట్లు మేసేజ్ రావడంతో సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇలాంటి ఫిర్యాదులు 45 వరకు రావడంతో సైబర్ క్రైం పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ మొదలు పెట్టారు. డబ్బులు ముంబయిలోని నాలుగు ఏటీఎం సెంటర్ల నుంచి విత్‌డ్రా అవుతునట్లు గుర్తించారు. పోలీసులు నిఘా పెట్టారు. గాబ్రియేల్ రజ్వన్‌ని, అలెగ్జాండర్ ముంబయి ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తుండగా అరెస్టు చేశారు. నిందితులను విచారించగా టీకు బొగ్దాన్, పికా ఉన్ మారియా.. రోమానియా వెళ్లిపోయినట్లు చెప్పారు. నిందితుల నుంచి 35లక్షల రూపాయల నగదు, క్లోనింగ్ మిషన్‌లు, 2040 డెబిట్ కార్డులు, 556 వినియోగించిన 556 డెబిట్ కార్డులు, మొబైల్ ఫోన్లు, హార్డ్‌డిస్క్‌లు స్వాధీనం చేసుకునట్లు సీపీ తెలిపారు. కార్యక్రమంలో క్రైం డీసీపీ జానకీ షర్మిల, ఏసీపీ శ్రీనివాస్, సీఐలు శివకుమార్, శ్రీనివాస్, ఎస్‌ఐ విజయ వర్దన్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు. నిందితులను అరెస్టు చేసిన అధికారులను సిబ్బందిని సీపీ అభినందించారు.