క్రైమ్/లీగల్

ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెబ్బెన, మే 15: మండలంలోని క్రిష్టాపూర్ గ్రామానికి చెందిన దుర్గం నర్సయ్య (35)ను అతని భార్య జ్యోతి ప్రియుడితో కలిసి గొంతు నులిమి హత్య చేసిన సంఘటన సంచలనం సృష్టించింది. ఆసిఫాబాద్ సీఐ బాలాజీ వరప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం క్రిష్టాపూర్ గ్రామానికి చెందిన దుర్గం నర్సయ్యను అతని భార్య జ్యోతి , అదే గ్రామానికి చెందిన ప్రియుడు శ్రీనివాస్‌తో కలిసి సోమవారం రాత్రి గొంతు పిసికి, తాడుతో ఉరి వేసి చంపినట్లు సీఐ పేర్కొన్నారు. నర్సయ్య జ్యోతిలు గత కొన్ని సంవత్సరాలుగా వివాహం చేసుకొని సంతోషంగా బతుకుతున్నారు.
అదే గ్రామానికి చెందిన శ్రీనివాస్‌తో అక్రమ సంబంధం ఏర్పర్చుకుంది. ఈ విషయమై భార్య, భర్తల మధ్య గొడవ జరిగిన్నట్లు తెలిపారు. సోమవారం రాత్రి మృతుని భార్య జ్యోతి, ప్రియుడు శ్రీనివాస్ పకడ్బందీ ప్లాన్‌తో సోమవారం రాత్రి గొంతు పిసికి, తాడుతో ఉరివేసినట్లు నాటకం ఆడారని, 108 అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయినట్లు భార్యజ్యోతి తెలిపినట్లు సీఐ పేర్కొన్నారు. విచారణలో దుర్గం నర్సయ్యను గొంతు నులిమి చంపినట్లు తేలిందని అన్నారు. మృతునికి ఇద్దరు కూతుళ్లు, కొడుకు ఉన్నారు. ఈ మేరకు రెబ్బెన ఎస్సై శివకుమార్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.