క్రైమ్/లీగల్

గవర్నర్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ రాంజెఠ్మలానీ పిటిషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూ ఢిల్లీ: రాజ్యాంగ విలువలకు తిలోదకాలిచ్చి బీజేపీని ప్రభుత్వం ఏర్పాటుకు కర్నాటక గవర్నర్ ఆహ్వానం పంపారని ఆరోపిస్తూ, గవర్నర్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రసిద్ధ న్యాయవాది రాంజెఠ్మలానీ గురువారం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరిస్తున్నట్లు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా ప్రకటించారు. కర్నాటకలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం రాంజెఠ్మలానీ పిటిషన్‌ను శుక్రవారం విచారిస్తుందన్నారు. న్యాయమూర్తి జస్టిస్ ఎఎణ ఖాన్వికర్, డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎకె సిక్రితో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను శుక్రవారం తన వాదనలు వినిపించాలని న్యాయవాది రాంజెఠ్మలానీని కోరింది.
ఇప్పటికే ఈ అంశంపై జేడీఎస్, కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్లు కూడా శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణకు రానున్నాయి. గవర్నర్ రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కారని న్యాయవాది రాంజెఠ్మలానీ పిటిషన్‌లో పేర్కొన్నారు. గవర్నర్ రాజ్యాంగ బద్ధంగా తనకు సంక్రమించిన అధికారాలను దుర్వినియోగం చేశారన్నారు. తాను ఏ పార్టీకి అనుకూలంగా, వ్యతిరేకంగా కోర్టుకు వచ్చి వాదనలు వినిపించనన్నారు. గవర్నర్ తీసుకున్న రాజ్యాంగ వ్యతిరేక చర్యలపై మాత్రమే తన వాదనలు వినిపిస్తానన్నారు. కాగా బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆదేశంమేరకు జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే, అశోక్ భూషణ్‌తో కూడిన ధర్మాసనం కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన విషయం విదితమే. యెడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకుండా స్టే ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేసింది.